ఈ ఒక్కటి రోజూ తినండి.. డయాబెటిస్ తో పాటు బరువుకు చెక్!
మనం నిత్యం తినే కూరగాయలలో క్యారెట్లు మంచి పోషకాలతో మన ఆరోగ్య రక్షణకు దోహదం చేసేవి. మన రోగనిరోధక శక్తిని పెంచే మంచి ఆహారంగా క్యారెట్ ను చెప్పవచ్చు. క్యారెట్లలో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉండే క్యారెట్లు శరీరంలో విటమిన్ A గా మారుతాయి. విటమిన్ A రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనది. విటమిన్ ఏ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
క్యారెట్ లలో ఫుల్ పోషకాలు
క్యారెట్లలో ల్యూటిన్ మరియు జియాక్సాంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి మేలు చేసే కణాల నష్టం నుండి రక్షిస్తాయి. రోజువారీ భోజనాలలో క్యారెట్లను చేర్చడం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్ లలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. క్యారెట్ మన శరీరానికి కావలసిన ఫైబర్ ను అందిస్తుంది. మన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు
క్యారెట్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన గట్ బలమైన రోగ నిరోధక వ్యవస్థను అందిస్తుంది. కాబట్టి క్యారెట్ ఆరోగ్యంగా ఉండాలని భావించే వారికి ఒక మంచి ఎంపిక.
క్యారెట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ దృష్టి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. క్యారెట్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల, అలాగే పొటాషియం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
డయాబెటిస్ కంట్రోల్ చేసే క్యారెట్స్
క్యారెట్లలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారి నుండి కాపాడతాయి. క్యారెట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ నుంచి కాపాడతాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు, జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ ఆహారంలో భాగంగా చేసుకోవాలి
క్యారెట్లను పచ్చిగా లేదా వండిన రూపంలో ఆస్వాదించవచ్చు. క్యారెట్లను సలాడ్లు, సూప్‌లు మరియు కర్రీల్లో చేర్చవచ్చు. జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. క్యారెట్ లరెగ్యులర్ వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లను చేర్చడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యారెట్ల లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని నిర్వహించడంలో గణనీయంగా సహాయపడతాయి.












Click it and Unblock the Notifications