ఇది ఒక్కటి తింటే బరువుకు, డయాబెటిస్ కు చెక్,ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
మనం నిత్యం వంటలో ఉపయోగించే ఒక పదార్థం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే దాని యొక్క ప్రయోజనాలను గురించి తెలుసుకుని దానిని వినియోగించుకోవడం అవసరం. సాధారణంగా మనం వంటలలో రుచికోసం ఉపయోగించే జీలకర్ర ఒక సుగంధ ద్రవ్యం. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
జీలకర్రలో ఫుల్ పోషకాలు
జీలకర్రలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే మరియు విటమిన్ b6 ఉంటాయి. అంతేకాదు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. జీలకర్రను మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్య రక్షణకు కీలకంగా పనిచేస్తాయి . జీలకర్ర మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీలకర్రతో డయాబెటిస్ కు చెక్
జీలకర్ర ఫుడ్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గట్ హెల్త్ కు దోహదం చేస్తుంది. జీలకర్ర మధుమేహం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని అధిగమించటానికి దోహదం చేస్తుంది. జీలకర్రను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు. జీలకర్ర ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రతో రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన శరీరంలోని ట్రై గ్లిజరైడ్స్ తగ్గించడానికి కూడా జీలకర్ర దోహదం చేస్తుంది.
జీలకర్రతో ఈ ప్రయోజనాలు కూడా
జీలకర్ర మన శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నిత్యం క్రమ పద్ధతిలో జీలకర్రను తీసుకుంటే ఇది మన కేంద్ర నాడీ వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపించి మన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం మనలో చాలామంది ఐరన్ డెఫిషియన్సీ తో బాధపడుతున్నారు. అటువంటివారు ప్రతిరోజు ఒక టీ స్పూన్ జీలకర్రను ఆహారంలో తీసుకుంటే ఐరన్ లోపాన్ని నివారించడానికి వీలవుతుంది.
జీలకర్రతో బరువు తగ్గే అవకాశం
జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది క్యాన్సర్ నియంత్రణకు దోహదం చేస్తుంది. డయేరియాతో బాధపడే వారికి జీలకర్ర ఉపయోగించడం వల్ల రిలీఫ్ వస్తుంది. జీలకర్రతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. జీలకర్ర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జీలకర్రను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications