ఈ ఆహారాలు తింటే శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది!
ప్రస్తుతం మనకు చెడు కొలెస్ట్రాల్ సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ అవసరం ఎంతైనా ఉంది. ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే మనం తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
ఓట్స్
కొన్ని రకాల ఆహార పదార్థాలతో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓట్స్ తింటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓట్స్ లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. ఓట్ మీల్స్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.

అవకాడో
అవకాడో లో కూడా మన శరీరానికి కావలసిన గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
చియా సీడ్స్
చియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్ మీల్ లో కలుపుకొని కానీ, స్మూతీస్, పెరుగులో వేసుకుని కానీ దీనిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఇది మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ తో మన గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
పండ్లు
మన గుండె ఆరోగ్యానికి హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా స్ట్రాబెరీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి బెర్రీ పండ్లను తింటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
నట్స్
బాదంపప్పు, వాల్ నట్స్ వంటి నట్స్ లో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెచ్డిఎల్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. వీటిలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇవి మనకు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications