బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటే మీ బాడీ లైట్ గా... హాయిగా!

చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు, దోసెలు, పూరీలు ఇలా రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ఇంకా మరికొంతమంది ఉదయం అల్పాహారం చేయకుండానే ఉంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ విషయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేసేవారు ఉదయం ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ చేయనివారు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్త
సహజంగా బ్రేక్ ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోస, పూరి, వడ, ఉప్మా ఇలాంటివి గుర్తొస్తాయి. పూరి, వడ వంటి నూనెతో తయారు చేసే ఆహారాలు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఇడ్లీ దోశలు కూడా వాటిని తయారు చేయడానికి బియ్యాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి అవి కూడా మన ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో మంచి ఆహారాన్ని తీసుకోవడానికి, పోషకాలను ఇచ్చే ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

Eating these for breakfast will make your body feel light and comfortable

బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తినండి
అటువంటి ఆహారాలలో ముఖ్యమైనవి ఓట్స్. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చి మన కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఓట్స్ లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో దోహదం చేస్తాయి. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం మంచి ఆహారంగా చెప్పవచ్చు. కూరగాయల ముక్కలు ఎక్కువ వేసి తయారుచేసే ఊతప్పం తింటే మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

మిల్లెట్ ఆహారాలు బెస్ట్
బ్రేక్ ఫాస్ట్ లో రాగి, జొన్న. మిల్లెట్ దోశలు, ఇడ్లీలు తినడం ఎంతో మంచిది. ఇవి గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ఐరన్ తో నిండి ఉంటుంది. ఇక ఇటువంటి పదార్థాలను తినేటప్పుడు చట్నీల విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తినాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే చట్నీలను తినకూడదు. ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చిలగడ దుంపలను తీసుకుంటే మంచిది. చిలకడదుంపలలో ఫైబర్, విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా అల్పాహారంలో తింటే మంచిది
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో ఉండేలా చూసుకుంటే మంచిది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అంతేకాదు దీనిలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కొవ్వును తగ్గించి శక్తిని పెంచుతాయి.

వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తినండి
ఇక బ్రేక్ ఫాస్ట్ లో చియా సీడ్స్ తీసుకుంటే మంచిది. చియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి శక్తిని పెంచుతాయి. బ్రేక్ ఫాస్ట్ చేసేవారు ఈ లైట్ ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+