వీటిని తింటే మీ లివర్ పాడైపోతుంది... జాగ్రత్త!

మానవ శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం. కాలేయం మన శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో, జీర్ణక్రియకు తోడ్పడటం లో కీలక భూమిక పోషిస్తుంది.అటువంటి కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం కొంతమేర ఆరోగ్యవంతులుగా ఉన్నట్టే. కాలేయానికి కొన్ని ఆహారాలు ప్రమాదకరం. మనకు తెలియకుండానే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కాలేయం ఆరోగ్యం కోసం ఇవి తినకండి
కాలేయం ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే ఏమి తినకూడదో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కాలేయం ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే కృత్రిమ స్వీటెనర్లు తినకూడదు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి నూనెలో వేయించిన పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. అంతే కాదు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినకుండా ఉండాలి.

Eating these will damage your liver Be careful

కాలేయంపై ప్రతికూల ప్రభావాలు చూపించే ఆహారాలు ఇవే
ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఫుడ్ లు కాలేయం పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి కారణమవుతాయి. ఇక కాలేయం ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మీట్ తినకుండా ఉండాలి. స్నాక్స్, సోడాలు, కూల్ డ్రింక్స్, కచప్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి కారణమవుతాయి.

ఇవి తింటే కాలేయం పాడవుతుంది
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి, వెన్న, అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. ఇది సిరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. లివర్ ఆరోగ్యం కోసం పచ్చి మాంసాన్ని తినకుండా ఉండాలి. తక్కువ వండిన మాంసాన్ని కూడా తినకుండా ఉంటేనే మంచిది. కూరగాయలను పచ్చిగా తినటం కూడా కాలేయం పైన అదనపు భారానికి కారణమవుతుంది.

ఆల్కాహాల్ కన్నా ఈ ఆహారాలే కాలేయానికి డేంజర్
కూరగాయలను, ఆకుకూరలను సరిగా కడగకుండా తినడం కూడా లివర్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఇక ఆల్కహాల్ తీసుకోవడం లివర్ ను పాడు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆల్కహాల్ కంటే పైన పేర్కొన్న ఆహారాలు మరింత డేంజర్. లివర్ ఆరోగ్యంగా ఉండాలని భావించే వారు వీటిని తినడం మానేయండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+