డిన్నర్ లో అల్పాహారం తింటున్నారా? అయితే తప్పక తెలుసుకోండి!
ప్రస్తుత పరుగులు ప్రపంచంలో మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మనలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. ఏ సమయంలో ఏం తినాలి ఎంత తినాలి అనేది తెలియకుండా మన ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తీసుకున్న ఆహారానికి తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం కూడా మనల్ని రోగగ్రస్తులుగా చేస్తుంది.
రాత్రివేళ అల్పాహారం మంచిదేనా
అందుకే ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పద్ధతి పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది రాత్రిపూట భోజనానికి బదులు ఏదో ఒక టిఫిన్ తింటూ ఉంటారు.. రాత్రిపూట భోజనం చేస్తేనే బరువు పెరుగుతున్నామని టిఫిన్ తినడం వల్ల బరువు కంట్రోల్ చేస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు .

అల్పాహారం పేరుతో అవి తినొద్దు
రాత్రిపూట అన్నానికి బదులు చాలా మంది చపాతీలు, ఇడ్లీలు వంటి అల్పాహారం తింటూ ఉంటారు. అయితే డిన్నర్ సమయం లో అల్పాహారం తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రాత్రివేళ అల్పాహారం పేరుతో చాలామంది హెవీగా పూరీలు, పరోటాలు తింటూ ఉంటారు.
కార్బో హైడ్రేట్ లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినొద్దు
అయితే అది ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నూనె ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ ని రాత్రిపూట తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు .అల్పాహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరైన పోషకాలు, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారాన్ని తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇవి తినండి .. ఇలాగే తినండి
పోహా, ఉప్మా, పన్నీర్ వంటి వాటిని అల్పాహారంగా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రాత్రివేళ భోజనం చేయకుండా అల్పాహారం తీసుకునేవారు లోకేలరి ఫుడ్స్ తీసుకుంటే మంచిదని, దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అన్నిటికంటే రాత్రివేళ ఏడు దాటిన తర్వాత తినకుండా ఉంటేనే మంచిదని, అల్పాహారం చేసినప్పటికీ 7 గంటల లోపే చేయాలని సూచిస్తున్నారు. ఇంకా అల్పాహారం చాలా మితంగా తినాలని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications