ఓట్స్ అధికంగా తింటే అనర్ధాలు.. జాగ్రత్త!

ఓట్స్... చాలామంది ప్రతిరోజూ ఓట్స్ తింటూ ఉంటారు. ఓట్స్ తో మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తారు. ఓట్స్ లో విటమిన్ బి2, విటమిన్ సి, పీచు పదార్థం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఓట్స్ చాలా మంచి పౌష్టికాహారంగా చెప్పవచ్చు.

అతిగా ఓట్స్ తింటే అనర్ధాలు
ఇక ఓట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట ఎంత వాస్తవమో అతిగా తింటే అనారోగ్యం కూడా వస్తుంది అనే విషయం అంతే వాస్తవం. ఇక ఓట్స్ తినడం వల్ల కలిగే అనారోగ్యాలు, మన శరీరానికి కలిగే నష్టాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.ఓట్స్ అతిగా తినడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. అధికంగా ఓట్స్ తిన్న వారిలో కొంతమందికి కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

Eating too much oats can be harmful Be careful

అధికంగా ఓట్స్ తింటే ఆరోగ్య సమస్యలు
ఓట్స్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఓట్స్ అధికంగా తినడం మంచిదికాదు. ఓట్స్ లోని ఫైటిక్ యాసిడ్ క్యాల్షియం ,ఇనుము మరియు జింక్ వంటి కొన్ని ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్ అధికంగా తిన్నవారు మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఓట్స్ లో ఉండే ప్రోటీన్ కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

ఓట్స్ పదేపదే తింటే ఇన్ఫెక్షన్స్
ఓట్స్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, అవి తిన్నవారికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. పోషకాలు బాగా ఉంటాయని అతిగా ఓట్స్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఓట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలామందిలో కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల వాటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం కారణంగా మన శరీరంలో కూడా క్యాలరీల లోపం ఏర్పడే అవకాశం ఉంది.

మితంగా తింటే ఆరోగ్యం
కాబట్టి ఓట్స్ ను తినాలి అని అనుకుంటే ఒక నియమిత పద్ధతిలో తినడం మంచిది. ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ మాత్రమే తినడం మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఓట్స్ అధికంగా తింటే కొన్ని దుష్ప్రభావాలు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకొని తదనుగుణంగా మితంగా తింటే మంచిది.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+