హెయిర్ డై వేసుకునే వారికి చర్మంపై మచ్చలు.. పోవటానికి చిట్కాలివే!!
ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందికి జుట్టు నెరిసిపోవడం పెద్ద సమస్యగా మారింది. జుట్టు తెల్లబడటం కామన్ గా మారిన నేటి రోజుల్లో హెయిర్ డై వేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖం అందంగా కనిపించడం కోసం ప్రస్తుత సమాజంలో హెయిర్ డై వాడడం, జుట్టుకు రంగు వేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది.
అయితే హెయిర్ డై వేసుకునేవారు అయితే వేసుకునే ప్రతిసారి ఒక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. హెయిర్ డై వేసుకున్న ప్రతిసారి జుట్టుకు ముందు భాగంలో ఉన్న చర్మంపైన మచ్చలు పడతాయి. ఈ మచ్చలు చూసేవారికి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. జుట్టుకు రంగు వేసుకున్నారు అనే భావన వచ్చేలా చేస్తాయి. ఈ మచ్చలు తొలగించుకోవడం కోసం నానా తిప్పలు పడతారు.

అయితే సహజ చిట్కాలతో నే ఈ మచ్చలు ఏవిధంగా తొలగించుకోవచ్చు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆ నిమ్మకాయ ముక్కలతో మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్ది, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కుంటే మచ్చలు తొలగిపోతాయి.
బేబీ ఆయిల్ తో పాటుగా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా హెయిర్ డై వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించటంలో ఉపయోగపడతాయి. మచ్చ పడిన చోట కొద్దిగా ఆయిల్ ను వేసి నిదానంగా మర్ధనా చేసి సున్నితంగా రుద్ది ఆపై వేడి నీళ్లతో కడిగితే మచ్చ తొలగిపోతుంది. అంతేకాదు వెనిగర్ ను కొద్దిగా దూది లో నుంచి మచ్చ పడిన చోట రుద్దితే మచ్చ తొలగిపోతుంది. అంతేకాదు అక్కడ శరీరం కూడా కాంతివంతంగా మారుతుంది.
డిటర్జెంట్ ను చేతిలోకి తీసుకొని మచ్చ పడిన చోట చేతివేళ్ళతో నిదానంగా రుద్దితే ఆపై గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే హెయిర్ డై వల్ల పడిన మచ్చ తొలగిపోతుంది. అంతే కాదు హెయిర్ కు హెయిర్ డై అప్లై చేసుకునే ముందే ముఖం ముందు భాగంలో నుదిటి పైన నూనె రాసుకుంటే త్వరగా మచ్చ పడకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే హెయిర్ డై వల్ల పడే మచ్చలను తొలగించుకోవచ్చు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications