లైంగిక సామర్ధ్యం పెంచే ఉల్లిపాయలతో ఊహించలేనంత ఆరోగ్యం!
మనం తినే కూరగాయలు ఆకుకూరలలో మాత్రమే కాదు మనం వంటకు ఉపయోగించే అనేక పదార్థాలు కూడా మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు మనం వంటలో ఉల్లిపాయలను వినియోగిస్తూ ఉంటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెబుతారు. అటువంటి ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తాయో తెలుసుకుందాం.
ఉల్లిపాయలతో బోలెడు లాభాలు
ఉల్లిపాయలలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. జుట్టు సంరక్షణ నుండి గుండె ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కదానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లిపాయలు బీపీని కంట్రోల్ చేస్తాయి. ఇక ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా వినియోగించడమే కాకుండా ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి.

ఉల్లిపాయలతో లైంగిక ఆరోగ్యం
ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతాయని పలు అధ్యయనాలలో తేలింది. ఇక ఉల్లిపాయలలో తెల్ల ఉల్లిపాయలు లైంగిక ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు ఉల్లిపాయల పేస్టును వెన్నతో కలిపి తీసుకుంటే కూడా లైంగిక శక్తి బాగా పెరుగుతుంది.
ఉల్లిపాయలు ఎక్కువ తినేవారిలో ఆ కోరికలు
ఉల్లి రసంలో అల్లం కలిపి తీసుకుంటే కూడా లైంగిక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకునే వారిలో లైంగిక ఆరోగ్య గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఉల్లిపాయలు వ్యక్తులలో లైంగిక కోరికలను ప్రభావితం చేయడమే కాకుండా జననేంద్రియాల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి..
ఉల్లిపాయలతో డయాబెటిస్ కంట్రోల్
ఉల్లిపాయలు ఒక్క లైంగిక ఆరోగ్యానికి మాత్రమే కాదు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. మన జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. ఉల్లిపాయలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ అలర్జీని తగ్గిస్తాయి. గొంతు సమస్యలు, దగ్గు జలుబు వంటి అలర్జీలను పరిష్కరించడంలో ఉల్లిపాయలు ఎంతగానో దోహదం చేస్తాయి .
ఉల్లిపాయలు ఆహారంలో భాగంగా చేసుకోండి
ఉల్లిపాయలతో ఆస్తమా తగ్గుతుంది. ఉల్లిపాయలు ఊబకాయం నుండి కాపాడతాయి. ఉల్లి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. అందుకే ఉల్లిపాయలను తక్కువగా చూడకుండా వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని క్రమం తప్పకుండా తీసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications