Health tips: నేరేడు పండ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోండి!!
వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు. నేరేడు పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతోపాటు, బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నేరేడు పండు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. నేరేడు పండు మంచి పోషకాల గని, ఎన్నో అనారోగ్యాల నివారణి.
అసలు నేరేడు పండు లో ఉండే పోషకాలు ఏమిటి? అది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేరేడు పండు లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు అధికంగా నేరేడు పండ్లలో ఉండటంవల్ల అవి మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

నేరేడు పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది మధుమేహ బాధితులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నేరేడు పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు నేరేడు పండ్లలో తగినంత మొత్తంలో ఐరన్, విటమిన్-సి ఉండటంవల్ల మన రక్తంలోని హిమోగ్లోబిన్ ను సమతుల్యం చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
నేరేడు పండ్లలో విటమిన్ సి ఉండటంవల్ల కంటిచూపు గణనీయంగా మెరుగుపడుతుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫలితంగా చర్మం పై మొటిమలు మరియు ముడతల సమస్యను తొలగించే అవకాశం ఉంటుంది. నేరేడు పండ్లను తినడం వల్ల చిగుళ్ళ వాపు సమస్య నుండి, నోటి దుర్వాసన నుండి ఉపశమనం లభిస్తుంది. కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలోనూ, జీర్ణశక్తిని మెరుగుపరచటంలోనూ నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాదు కాలేయ సమస్యల నుండి కూడా నేరేడు పండు ఉపశమనం కలిగిస్తుంది. నేరేడు పండ్లు తింటే కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి .వ్యాధినిరోధక శక్తిని పెంచే నేరేడు పండ్లతో నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు తగ్గిపోయి తక్షణ శక్తి వస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడానికి కూడా నేరేడు పండు ఎంతగానో పనిచేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు -
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications