health tips: ఊరికే అలసిపోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!!

చాలామంది బాగా పని చేయకపోయినా అలసట ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ చిట్కాలను పాటిస్తే అలసట నుంచి ఉపశమనం దొరుకుతుంది.

చాలామంది బాగా పని చేయకపోయినా అలసట ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. శారీరకంగా శ్రమ ఎక్కువైతేనే కాదు, మానసికంగా శ్రమ ఎక్కువైనా బాగా అలసట కలుగుతుంది. ఏ పని చేసినా అలసిపోయి ఓపిక లేనట్టుగా ఉంటారు. ఇక అటువంటివారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల అలసట నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.

 అలసట తగ్గాలంటే ఈ పని చెయ్యండి

అలసట తగ్గాలంటే ఈ పని చెయ్యండి

శరీరానికి తగినంత పోషకాలు అందకపోతే అలసటగా అనిపిస్తుంది. ఇక అలసట నుంచి బయటపడడం కోసం శరీరానికి తగినంత నీటిని తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే త్వరగా అలసట రాదు. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజులో కనీసం నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగడం వల్ల అలసట సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.

అలసట తగ్గాలంటే దీనిని మరచిపోకండి

అలసట తగ్గాలంటే దీనిని మరచిపోకండి

ఇక అలసటతో ఇబ్బంది పడేవారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉదయం అల్పాహారం తప్పకుండా చేయాలి. అల్పాహారం చేయకుండా స్కిప్ చేసే వారికి కచ్చితంగా అలసట సమస్య ఉంటుంది. కాబట్టి శరీరం శక్తి హీనం కాకుండా ఉండటం కోసం, అలసట లేకుండా యాక్టివ్ గా పని చేయడం కోసం బ్రేక్ ఫాస్ట్ చేయడం అసలే మరిచిపోవద్దు. ఇక మధ్యాహ్నం భోజనంలో కూడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. అలసటను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలసట తగ్గాలంటే ఆహారం విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి

అలసట తగ్గాలంటే ఆహారం విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి


అంతేకాదు అలసట సమస్యతో బాధపడుతున్న వారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు అతిగా తీసుకోకూడదు. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోయి యాక్టివ్ నెస్ తగ్గుతుంది. ఫలితంగా ఆయాసం, అలసట వస్తాయి. మితంగా ఆహారం తీసుకుంటే అలసట ఇబ్బంది అంతగా ఉండదు. ఇక రక్తహీనతతో బాధపడేవారు ఎక్కువగా అలసటకు గురవుతూ ఉంటారు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

అలసట నుండి రిలాక్స్ అవ్వటం కోసం వీటికి దూరంగా ఉండండి

అలసట నుండి రిలాక్స్ అవ్వటం కోసం వీటికి దూరంగా ఉండండి

చాలామంది అలసిపోయి రిలాక్స్ అవ్వడం కోసం కాఫీలు, టీలు ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. కానీ కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు అలసటను మరింత పెంచుతాయి. మరింత చిరాకును తెప్పిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇక ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకున్నా అలసట నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

అలా చేస్తే నీరసంతో పాటు అలసట .. జాగ్రత్త

అలా చేస్తే నీరసంతో పాటు అలసట .. జాగ్రత్త


అంతేకాదు చాలామంది క్రమబద్ధమైన ఆహార నియమాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం, లేదా తినకుండా ఉండడం వంటివి చేస్తూ ఉంటారు. ఏ వారంలో మూడు నాలుగు రోజులు ఉపవాసాలు చేస్తుంటారు. ఇలా చేస్తే కూడా అలసట బారిన పడతారని చెబుతున్నారు. వారానికి ఒకరోజు ఉపవాసం చేస్తే పరవాలేదు కానీ, తరచూ ఉపవాసం చేయడం వల్ల శరీరం నిరసించిపోయి అలసటకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం, తగినంత నీటిని నిత్యం మరచిపోకుండా తీసుకోవడం, క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడంతో కొంతమేరకు అలసట సమస్య నుంచి బయటపడవచ్చు అని తెలుస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+