health tips: మూత్ర విసర్జన చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి!!
మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలామంది చేయకూడని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసే ముందు, చేసిన తర్వాత ఏం చేయొచ్చు? ఏమి చేయకూడదు? వంటి వివరాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, మూత్ర సంబంధితమైన సమస్యలు రాకుండా ఉండడం కోసం మూత్ర విసర్జన సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి.
చాలామంది మూత్ర విసర్జన చేసిన తరువాత వెంటనే వచ్చి మళ్లీ మంచి నీళ్లు తాగుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు మూత్రాన్ని ఆపుకొని ఉంచకూడదు. ఎప్పుడైనా మూత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చిన వెంటనే మూత్ర విసర్జన చేయాలి.

మూత్ర విసర్జన చేసిన వెంటనే నోరు పుక్కిలించకూడదు. ఒకవేళ అలా చేస్తే వెంటనే మళ్ళీ మూత్రం వస్తుంది. ఇక మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అంతే కాదు భోజనం చేసిన వెంటనే మూత్రవిసర్జన తప్పనిసరిగా చేయాలి .దీనివల్ల కిడ్నీలు పాడవకుండా ఉంటాయి.
రాత్రి పడుకునే ముందు కూడా మూత్ర విసర్జన చేసి పడుకోవాలి. ఇక స్నానానికి అరగంట ముందు కానీ, అరగంట తర్వాత కానీ మర్చిపోయి కూడా మూత్ర విసర్జన చేయకూడదు. అలా చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో మంట లేదా దురదగా అనిపిస్తే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఎప్పుడైనా ఎక్కువ నూనె, మసాలా, మైదాతో చేసిన భోజనం తింటే, తిన్న గంట తర్వాత ఎక్కువ నీరు తాగాలి . వీలైతే గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ప్రతి ఒక్కరూ మూత్రవిసర్జన సమయంలో ఈ విషయాలన్నింటినీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications