మటన్, చికెన్ దండగ.. బోడ కాకరకాయ ఉండగా!!
చికెన్, మటన్ కంటే సూపర్ పోషకాలు ఉన్న వెజిటేబుల్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. చికెన్, మటన్ కంటే ఫుల్లుగా పోషకాలు ఉన్న ఒక కూరగాయ శాఖాహార భోజనం చేసే వారికి అద్భుతమైన కూరగాయగా చెప్పవచ్చు. అటువంటి కూరగాయలలో బోడ కాకరకాయ ఒకటి.
బోడ కాకర కాయలను బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలోనే ఈ కాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఆయుర్వేదం ప్రకారం అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బోడ కాకర కాయలు నిత్యం తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.

ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. బోడ కాకర కాయలు తింటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బోడ కాకర కాయలు తినడం వల్ల ఇది రక్తంలోని చక్కెర ను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిదని చెప్పబడింది.
ఫైటో న్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరంనుండి నీరసాన్ని తగ్గిస్తుంది. ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. బోడ కాకర కాయలలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. బోడ కాకర కాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి.
అంతేకాదు బోడ కాకరకాయ లను గర్భిణీ స్త్రీలు కూడా కూర చేసుకొని తినడం వల్ల గర్భస్థ శిశువు కూడా బాగా ఎదుగుతుందని చెబుతారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న బోడ కాకరకాయను ఈ సీజన్లో తినడం అసలు మర్చిపోవద్దు. చికెన్, మటన్ కంటే ఇది గొప్ప పోషకాలతో ఉన్న కూరగాయ కాబట్టి దీన్ని తినడానికి అసలు లేట్ చెయ్యొద్దు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications