health tips: మనకు తెలీకుండానే మన మెదడును దెబ్బతీసే ఈ అలవాట్లు మార్చుకోండి!!
ప్రతిరోజు మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా మన మెదడు పనితీరుపై ప్రభావం చూపించే అలవాట్లు చాలానే ఉన్నాయి. ఎటువంటి అలవాట్లు మన మెదడుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మెదడుని దెబ్బతీస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చాలామంది మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మెదడును దెబ్బతీస్తుంది. దీనివల్ల మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. చాలామంది బిజీగా ఉన్నాము అన్న పేరుతో సరైన ఆహారం తీసుకోరు. శరీరానికి కావలసినంత నీటిని, పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల అది మెదడు పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మెదడుకు ఏమాత్రం మంచిది కాదు.

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అదనపు ఒత్తిడికి గురవుతున్నారు. అధిక ఒత్తిడి మన మెదడు పైన ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. ఇటీవల కాలంలో చాలామంది చాలా తక్కువ నిద్రపోతున్నారు. ఎక్కువ ఒత్తిడి, తక్కువ నిద్ర రెండు మెదడును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
కొంతమంది ఎవరితోనూ కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారిలో వారు అంతర్ముఖులు గా ఉంటారు. అలా ఉండడం మెదడుకు చాలా హానికరం అని చెబుతున్నారు. చాలామంది ఒకే చోట ఎక్కువసేపు పనిచేయడం చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల కూడా మెదడుకు హాని కలుగుతుందని చెబుతున్నారు. అందుకే కూర్చున్న చోటు నుంచి ప్రతి 15 నుండి 30 నిమిషాలకు ఒకసారి కదలాలని సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. జంక్ ఫుడ్ శరీరానికి ఏ విధంగా అయితే హాని చేస్తుందో, మెదడుకు కూడా అంతే హాని చేస్తుంది. ఎక్కువగా పిండి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. రక్తంలో పెరిగే అదనపు చక్కెర మెదడుపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
చాలామంది రెగ్యులర్ గా హెడ్ ఫోన్ ను ఉపయోగిస్తూ ఉంటారు. హెడ్ ఫోన్లను ఉపయోగించడం వల్ల చెవి సమస్యలతో పాటు మెదడుకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం మన ఆరోగ్యానికి ఎంత హానికరమో, మెదడుకు కూడా అంతే హానికరం. ధూమపానం వల్ల డెమన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండా చేసే ఈ చిన్నచిన్న అలవాట్ల వల్లే మెదడుకు హాని కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications