బరువు తగ్గాలంటే ఇవి అస్సలు చెయ్యొద్దు!

చాలామంది ప్రస్తుత సమాజంలో విపరీతమైన బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు బరువు తగ్గలేకపోతున్నారు. ఇక అలాంటివారు బరువు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకునే ముందు ఏం చేయకూడదు కచ్చితంగా తెలుసుకోవాలి. బరువు తగ్గాలని భావించేవారు చేయకూడని కొన్ని పనులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే ఇవి చెయ్యకండి
బరువు తగ్గాలని భావించేవారు ఇష్టం వచ్చిన సమయాల్లో తినడం ఇష్టం వచ్చిన సమయాల్లో వ్యాయామం చేయడం చేయకూడదు. బరువు తగ్గాలని భావించే వారికి ఒక నిర్దిష్టమైన జీవన శైలి ఉండాలి. ప్రతిరోజు ఏ సమయానికి వ్యాయామం చేస్తారో అదే సమయానికి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఏ సమయానికి భోజనం చేస్తారో అదే సమయానికి భోజనం చేయాలి.

health tips Do not do these things if you want to lose weight

నిద్ర, వ్యాయామం విషయంలో జాగ్రత్త
ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ఇష్టం వచ్చినట్టు వర్కౌట్స్, గుర్తొచ్చినప్పుడు ఆహారం తీసుకుంటే బరువు తగ్గరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇక బరువు తగ్గాలని భావించేవారు రాత్రుళ్ళు అర్ధరాత్రి దాకా మెలకువతో ఉండకూడదు. ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం 6 గంటల వరకు కచ్చితంగా నిద్రపోవాలి.

ఇవి నిర్లక్ష్యం చెయ్యకూడదు
అర్ధరాత్రి దాకా మెలకువతో ఉండి ఉదయాన్నే పడుకుంటే వారు బరువు తగ్గే అవకాశం లేదు. ఇక బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు సూర్యోదయాన్ని నిద్రలేచి ఓ గంట పాటు వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేయాలి. ఇది ప్రతిరోజు జీవితంలో ఒక భాగం కావాలి. ఈ విషయాన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

ఆహార నియామల విషయంలో జాగ్రత్త
ఇక బరువు తగ్గాలని భావించేవారు ఆహార నియమాలు పాటించాలి. బయట ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి అయితే తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తినాలి. పోషకాలు ఉండే నూనె తక్కువ వినియోగించే ఆహారాలను తినాలి. ఆహార నియమాలు సరిగ్గా పాటించి సరైన జీవనశైలిని అలవాటు చేసుకుని ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేస్తే క్రమంగా బరువు తగ్గుతారు. కనుక ఈ విషయాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+