Health tips: డెంగ్యూతో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందా? అయితే ఇవి తినండి!!

దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. మరణాల రేటు కూడా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డెంగ్యూ వచ్చినవారికి ప్రధానమైనటువంటి ఆందోళన ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం. డెంగ్యూ తో బాధపడుతున్న వారు ప్లేట్లెట్ కౌంట్ పెరగడం కోసం కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

డెంగ్యూ బారినపడిన వారు ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఆ ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి తగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీరు పుష్కలంగా ద్రవపదార్థాలను తీసుకోవాలి. తాజా పండ్ల రసాలను, తాజా కొబ్బరి నీళ్లను, దానిమ్మ, పైనాపిల్ జ్యూస్ లను తీసుకోవాలి. డెంగ్యూ తో బాధపడుతున్న వారు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

Health tips: Does platelet count decrease with dengue? But eat these foods!!

సిట్రస్ ఉన్న పండ్లు, బచ్చలి కూర, స్ట్రాబెరీ వంటి విటమిన్ సి, విటమిన్ కే ఉండే ఆహార పదార్థాలు ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి గణనీయంగా ఉపయోగపడతాయి.చేపలు, మాంసం, గుడ్లు మొదలైన ఆహారాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. అంతేకాదు మాంసం, బీన్స్, కాయ ధాన్యాలు, బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయి.

ఇక బొప్పాయిలో జీవక్రియకు సహాయపడే పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల, బొప్పాయి జ్యూస్ డెంగ్యూ జ్వరంతో బాధపడే వారికి ఎంతో బాగా పనిచేస్తుంది. బొప్పాయి జ్యూస్ ప్లేట్లెట్ కౌంట్ ను బాగా పెంచుతుంది. దానిమ్మ, ఎండుద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో గణనీయంగా పనిచేస్తుంది.

డెంగ్యూ తో బాధపడుతున్న వారు బాగా స్పైసి, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పచ్చి ఆకుకూరలు సలాడ్లుగా, ఉడకబెట్టుకుని తింటే మంచిది. అన్నిటికంటే పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరాన్ని దోమల బారి నుండి కాపాడుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. శరీరం అంతా కప్పబడేలా బట్టలు వేసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+