health tips: మెంతులు... ఆహారంలో భాగం చేసుకుంటే ఉండవిక ఆరోగ్య చింతలు!!
మెంతులు... తినడానికి చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా మెంతులను ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. ఇక మెంతుల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? మెంతులను ఏవిధంగా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చాలామంది వంటలో రుచిని పెంచడానికి మెంతులను ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. బరువు తగ్గాలని భావించేవారు కూడా మెంతులను నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఆ నీటిని తాగుతారు. అయితే మెంతులను ఏ విధంగా ఉపయోగించాలో తెలిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, మెంతులతో అనారోగ్య చింతలు దూరమవుతాయని చెబుతున్నారు.

వైద్యుల ప్రకారం వ్యాధులను అరికట్టడంలో మెంతులు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెంతులలో పోషకాలు సమృద్ధిగా ఉండి అవి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. మెంతులలో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు వివిధ ఖనిజాలతో నిండిన గుణాలు వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
మధుమేహం, ఊబకాయం, జీర్ణ సమస్యలతో బాధపడే వారు మెంతులను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే వాటి నుండి వారికి ఉపశమనం లభిస్తుంది. మెంతి డిటాక్స్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి ఇన్సులిన్ బ్యాలెన్స్ చేసి జీవక్రియను పెంచడంలో ఇది సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో మెంతి డిటాక్స్ వాటర్ తాగితే ప్రయోజనం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా మెంతి ఎంతగానో పనిచేస్తుంది. మెంతి టీ తయారు చేసుకోవడం ద్వారా, ఆ టీని రెగ్యులర్ గా తాగడం ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. దానిని తయారు చేసుకోవడానికి 1స్పూన్ మెంతిపొడిని, కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత దానిని వడకట్టి నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ కావడమే కాకుండా, ఇది జీర్ణక్రియను బాగా పెంచుతుంది.
ఇక మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల కూడా వేగంగా బరువు తగ్గడంతో పాటు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం చేసుకునే వంటలలో మసాలాగా మెంతి పొడిని ఉపయోగించడం వల్ల కూడా మెంతిని మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. చేదుగా ఉండే మెంతి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎంతో మేలు చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications