Health tips: స్లిమ్ గా ఉండాలంటే రోజూ అరగంట ఈ పని చెయ్యండి చాలు!!

చాలామంది స్లిమ్ గా ఉండాలని తెగ తాపత్రయ పడుతూ ఉంటారు. దానికోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. తిండి కూడా సరిగ్గా తినకుండా కడుపుని ఎండ కట్టుకుంటూ, జిమ్స్ చుట్టూ ఏరోబిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అటువంటి వారు స్లిమ్ గా ఉండాలంటే రోజూ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక అరగంట పాటు ఒక పని చేస్తే స్లిమ్ గా ఉంటారు.

ప్రతిరోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి నిర్దిష్టమైన వయోపరిమితి ఏది లేదు. ఒక వ్యక్తి శారీరక మరియు మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే అటువంటివారు వైద్యుల సలహా మేరకు సైకిల్ తొక్క కూడదు మినహాయించి, మిగతా ప్రతి ఒక్కరు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్క వచ్చు.

Health tips: If you want to be slim, do this for half an hour every day!!

వయసును మరియు శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సైక్లింగ్ గుండె మరియు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా సైక్లింగ్ చేస్తుంది. ఇది శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి శరీర భాగాలకు సరైన ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడంలో ఎంతో సహాయపడుతుంది.

సైక్లింగ్ బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులోని ప్రాంతాలను సక్రియం చేసి మెదడు పనితీరును మెరుగుపరచడానికి సైక్లింగ్ ఉపయోగపడుతుంది. సైక్లింగ్ తొడలు, తుంటి, ఉదర కండరాలు మరియు భుజాలను బలపరుస్తుంది. సైక్లింగ్ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇది మీ మనసుకు శాంతిని మరియు స్థిరత్వాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కనక ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట పాటు సైక్లింగ్ చేస్తే దూరంగా ఉండటమే కాకుండా స్లిమ్ గాను ఉంటారు. ఇక ఈ విషయాన్ని గుర్తుంచుకొని క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయాలని, అప్పుడే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+