Health tips: కిడ్నీ ఫెయిల్యూర్ అయితే కనిపించే లక్షణాలు ఇవే!!
మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి. కిడ్నీలు పాడైతే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మానవ శరీరంలో భాగమైన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది.
చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీ ఆరోగ్యంపై అందరికీ అవగాహన ఖచ్చితంగా ఉండాలి. కిడ్నీలు పాడైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి? కిడ్నీలు పాడైతే కనిపించే లక్షణాలు ఏమిటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మూత్రపిండాలు పాడైతే పాదాలు మరియు చీలమండలలో వాపు యొక్క లక్షణాలు కనిపిస్తాయి. అలా పాదాలలో చీలమండల లో వాపు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. మూత్రపిండాల ఫిల్టర్ దెబ్బతిన్నప్పుడు రక్త కణాలు మూత్రం లోకి ప్రవహించడం ప్రారంభిస్తుంది మూత్రంలో రక్తం మూత్రపిండాలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పడానికి సంకేతం కావచ్చు.
మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది ఆకలిని తగ్గేలా చేస్తుంది. మూత్రపిండాల వైఫల్యం కారణంగా రక్తం మరియు పోషకాల పరిమాణం సమతుల్యంగా ఉండదు. ఇది చర్మంలో పొడి తనానికి మరియు దురదకు కారణమవుతుంది. మూత్రపిండాలు పాడైతే వడపోత పనిచేయకపోవడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. ఈ తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది.
కొంతమందిలో వాంతులు అవుతుంటాయి. అయితే అజీర్ణం వల్ల వాంతులైనవారు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతాయి. మందులు వేసుకున్న వాంతులు తగ్గడం లేదంటే మూత్రపిండాలు పాడయ్యాయి అనే సంకేతం అని చెప్పవచ్చు. మూత్రపిండాలు పాడైతే మూత్రంలో నురుగు రావడం కనిపిస్తుంది అంటే శరీరంలోని ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి అని అర్థం. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యుడు దగ్గరికి వెళ్లి మూత్రపిండాల పరిస్థితిని తెలుసుకొని చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications