health tips: బెల్లంతో ఆరోగ్యం.. చిన్న బెల్లంముక్క ఎన్ని రోగాలకు చెక్ పెడుతుందో తెలుసా!!
మనకు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా జలుబు, దగ్గు, నొప్పులు, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక అటువంటి సమస్యలనుంచి ఉపశమనం పొందడం కోసం చాలామంది మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు మెడిసిన్స్ వేసుకోవటం మంచిది కాదని సూచించబడింది . అయితే మెడిసిన్స్ కాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో కొన్ని చిట్కాలను పాటిస్తే చాలావరకు అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చని నేచురోపతి వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బెల్లంతో చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు.

బెల్లంతో బోలెడు అనారోగ్య సమస్యలకు చెక్
ఇక ఆ వైద్య చిట్కాల విషయానికి వస్తే ముక్కు కారుతూ బాధపడుతున్నవారు పెరుగు, బెల్లం కలుపుకుని రోజూ రెండు పూటలా తింటే, జలుబు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు నెయ్యి తో బెల్లం వేడి చేసి మన శరీరంలో ఎక్కడైనా ఏ భాగంలో అయినా నొప్పిగా ఉంటే అక్కడ పెడితే నొప్పి తగ్గిపోతుందని పలువురు చెబుతున్నారు. ఇక బాగా మైగ్రేన్ తల నొప్పి తో బాధపడుతున్నవారికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు బెల్లం, నెయ్యి సమపాళ్లలో కలిపి తింటే ఐదు నుండి ఆరు రోజుల్లో తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.

బెల్లంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం, లివర్ కు శ్రేష్టం
బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది కణాలలో ఆమ్లాలూ, అసిటోన్ ల పై దాడి చేసే ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది అని చెబుతున్నారు. ఇక బెల్లాన్ని ఎక్కువగా తినడం వల్ల అది ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది అని, లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని అంటున్నారు. భోజనం చేసిన ప్రతిసారీ బెల్లాన్ని కాస్త తినడం వల్ల అది యాసిడిటీని తగ్గించి, జీర్ణ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతుందని చెబుతున్నారు. లివర్ ను శుభ్రపరచడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందని, బెల్లం తింటే లివర్ లో ఉండే హానికర పదార్థాలు, విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు.

బెల్లంతో జీర్ణ వ్యవస్థకు మేలు.. బరువు తగ్గించటంలోనూ కీలకం
బెల్లం నిత్యం తినటం వల్ల ఆహార నాళాలు కూడా శుద్ధి పడి, రక్తం కూడా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తాయని చెబుతున్నారు. ఒంట్లో అధికంగా ఉండే నీటిని బయటకు పంపడానికి, అధిక బరువును తగ్గించడానికి, గుండెజబ్బులు రాకుండా చూడడానికి కూడా బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నీళ్లలో బెల్లం వేసుకుని కలిపి తాగితే శరీరంలో ఉండే వేడి తగ్గుతుందని బెల్లం లో ఉండే సహజమైన తీపి శరీరానికి చాలావరకు శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇంట్లో ఉండే పదార్థం అయిన బెల్లంతో మన శరీరాన్ని ఇబ్బంది పెట్టి అనేక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications