mental stress.. 95 శాతం వ్యాధులకు మూలమిదే... తగ్గించుకోండిలా!
ప్రస్తుత సమాజంలో మన జీవనశైలి విధానాల కారణంగా చాలామంది విపరీతమైన స్ట్రెస్ బారినపడి కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆఫీసుల్లో పని ఒత్తిడి, ఏదైనా పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిన డెడ్లైన్స్ వంటి అనేక కారణాలు మనం మానసికంగా విపరీతమైన ఒత్తిడిని ఫేస్ చేసేలా చేస్తున్నాయి. మనకు తెలియకుండానే మనలో పెరుగుతున్న ఈ ఒత్తిడి మనలను అనేక రోగాల బారిన పడేస్తోంది.
ఒత్తిడే రోగాలకు మూలం
ఒత్తిడి కారణంగా మన శరీరంలో హానికరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అయితే మనకు కలిగిన ఒత్తిడి నుండి స్ట్రెస్ ఫ్రీ స్థితి రాకపోతే ఆ హానికరమైన హార్మోన్లు మన శరీరం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం మనుషులు ఈ స్ట్రెస్ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోటీ ప్రపంచంలో పదేపదే పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

95 శాతం వ్యాధులు స్ట్రెస్, అలసట వల్లనే
దీర్ఘకాలికంగా ఎవరైతే స్ట్రెస్ తో ఇబ్బంది పడుతున్నారో వారు ప్రాణాంతకమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతమైన స్ట్రెస్ మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మన శరీరం అంతులేని అలసటకు గురయ్యేలా చేస్తుంది. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో 95 శాతం వ్యాధులు స్ట్రెస్, అలసట వల్ల కలుగుతున్నట్టుగా గుర్తించారు అంటే స్ట్రెస్ మన ఆరోగ్యాన్ని ఎంతగా పాడు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆహారపు అలవాట్లతోనూ స్ట్రెస్
మనం మనలో ఉన్న స్ట్రెస్ ను అదుపు చేయలేకపోతే అది మనలను తన కంట్రోల్ లోకి తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇక స్ట్రెస్ ను ప్రభావితం చేసే అంశాలలో ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మన భోజనంలో వినియోగించే తీపి పదార్థాలు మనలో స్ట్రెస్ ను బాగా పెంచుతాయి. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
స్ట్రెస్ తగ్గాలంటే ఇలా చెయ్యండి
స్ట్రెస్ తో బాధపడుతున్న వారు స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలి. యోగ సాధన చేయడం కూడా మనల్ని స్ట్రెస్ నుంచి బయట పడేస్తుంది. అంతే కాదు క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకొని, సరైన ఆహారపు అలవాట్లతో, నిర్ణీత సమయాన్ని ప్రతి పనికి కేటాయించుకొని ముందుకు సాగినప్పుడు కొంతమేర స్ట్రెస్ తగ్గుతుంది.
ఇష్టమైన పనులు, స్నేహితులతో సరదాలు.. స్ట్రెస్ తగ్గిస్తాయి
ఇక స్ట్రెస్ ను మరింత తగ్గించుకోవడానికి మనకు ఇష్టమైన పనులను మనసుకు సంతోషం కలిగించే పనులను ఆహ్లాదం కలిగించే పనులను తప్పనిసరిగా చేయాలి. బయట స్నేహితులతో సరదాగా గడిపే సమయం కల్పించుకోవాలి. ఇలా చేస్తే స్ట్రెస్ నుండి మాత్రమే కాదు చాలా రోగాలనుంచి కూడా మనం బయట పడతాం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications