health tips: జిమ్‌లు, ప్రోటీన్ డ్రింకులు కాదు: బరువు తగ్గటానికి పాటించాల్సిన ప్రాధమిక సూత్రాలివే!!

బరువు తగ్గటానికి జిమ్‌లు, ప్రోటీన్ డ్రింకుల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నిత్యం మనం జీవితంలో భాగం చేసుకోవాల్సిన బరువు తగ్గటానికి పాటించాల్సిన ప్రాధమిక సూత్రాలను తెలుసుకుని వాటిని పాటించాలి.

చాలామంది విపరీతంగా బరువు పెరిగుతున్నామని తెగ బాధపడిపోతూ ఉంటారు. బరువు తగ్గడం కోసం నానా తండాలు పడుతూ ఉంటారు. కొద్దిరోజులు జిమ్ కి వెళతారు. కొద్దిరోజులు ప్రోటీన్ షేక్ లు తాగుతారు. కొద్దిరోజులపాటు విపరీతంగా ఎక్సర్సైజులు చేస్తారు, ఇక డైటింగ్ మాటైతే చెప్పనవసరం లేదు. కానీ ఏం చేసినా వారు మాత్రం వారు బరువు తగ్గరు. కొద్దిరోజులు తగ్గి, మళ్ళీ పెరిగిపోతారు. అయితే బరువు తగ్గటానికి ఇవన్నీ మార్గాలు కాదని చెప్తున్నారు వైద్యులు.

బరువు తగ్గాలంటే తెలుసుకోవాల్సిన ప్రాధమిక సూత్రాలు ఇవే

బరువు తగ్గాలంటే తెలుసుకోవాల్సిన ప్రాధమిక సూత్రాలు ఇవే

అసలు బరువు తగ్గాలంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకొని వాటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండటం కోసం మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన ప్రాథమిక సూత్రాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు ముందు బరువు తగ్గడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఉదయం లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి. కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు వ్యాయామం కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయాలి. ఇక దీనిని నిత్యం జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.

వ్యాయామం , భోజనం విషయంలో జాగ్రత్తలు ఇవే

వ్యాయామం , భోజనం విషయంలో జాగ్రత్తలు ఇవే

ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామాన్ని ఆపకూడదు. ప్రతిరోజు ఉదయం పది నిమిషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి. స్నానానికి ఎప్పుడూ వేడి నీళ్లనే ఉపయోగించాలి. 9 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అయితే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్ , మొలకలు, వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ లాంటివి బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పండ్లు, కూరగాయలతో పౌష్టికాహారం

పండ్లు, కూరగాయలతో పౌష్టికాహారం

ఇక మధ్యాహ్న ఒంటిగంట వరకే లంచ్ చేసేయాలి. లంచ్ లో కూడా ఆకుకూరలు, నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తినాలి. పౌష్టికాహారం తినాలి. రాత్రి 7 గంటల లోపే డిన్నర్ ముగించేసేయాలి. ఇక బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, స్ట్రాబెరీ, ఆపిల్ వంటి విటమిన్ సి వున్న పండ్లు తీసుకోవాలి. భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే బీరకాయ, సొరకాయ, దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పోషకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.

బరువు ఆరోగ్యంగా తగ్గాలంటే బేసిక్ రూల్ ఇదే

బరువు ఆరోగ్యంగా తగ్గాలంటే బేసిక్ రూల్ ఇదే


ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల నీళ్లను త్రాగాలి. మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి. స్వీట్లు, కూల్ డ్రింకులు, బయట దొరికే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రాత్రివేళ కనీసం 7 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ, ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. సమయానికి కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. ఒకరోజు చేసి ఒక రోజు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చెయ్యటం వంటివి చేస్తే బరువు తగ్గకపోగా మరింత ఇబ్బంది వస్తుంది. అందుకే ఆహార నియమాలను కానీ, వ్యాయామ నియమాలను కానీ కచ్చితంగా తప్పనిసరిగా జీవితంలో భాగంగా చేసుకోవాలి. దీంతో బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఆరోగ్యంగా జీవించటం కోసం కూడా ఈ ప్రాధమిక సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+