health tips: పాలకూరలో పోషకాలు మెండు; హెల్త్ బెనిఫిట్స్ బోలెడు.. కానీ వాళ్ళు జాగ్రత్త!!
పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలతో బాధపడే వారు పాలకూర ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు, న్యూట్రిషనిష్టులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మన ఆహారంలో తోటకూర, పాలకూర వంటి వాటిని భాగంగా చేసుకుంటే మంచిదని కూడా సలహా ఇస్తూ ఉంటారు. పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు, ఎక్కువ తినకూడదని మరికొందరు చెబుతూ ఉంటారు, అసలు ఇందులో నిజమెంత? ఈ ప్రచారంలో వాస్తవం ఎంత?

పాలకూర తింటే మంచిదేనా?
పోషకాల గని అయిన తోటకూరను మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడమే కాకుండా రోగినిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవడానికి వీలవుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం. ఇక పాలకూరలో ఉండే పోషకాలు ఏమిటి? పాలకూరను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? పాలకూరను అధికంగా తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

పాలకూరతో బీపీ, డయాబెటిస్ సమస్యలు తగ్గుతాయా?
పాలకూర.. పాలకూరలో ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసిన అనేక మంచి పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బిపి, మధుమేహం వంటి సమస్యల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పాలకూర ఎంతగానో పనిచేస్తుంది.

పాలకూరతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్.. కానీ
పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. పాలకూర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో చోటు చేసుకునే అనేక రకాల అలర్జీల నుండి కూడా పాలకూర మనల్ని రక్షిస్తుంది. విపరీతంగా బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తాయి. అయితే పాలకూరను మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

మూత్రపిండాల సమస్య ఉంటే పాలకూర తినొచ్చా?
ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే పాలకూరలో ఉండే ఆక్సాలిన్ మూత్రపిండాలలో రాళ్లు తయారు కావడానికి కారణం అవుతుంది. కాబట్టి పాలకూరను మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఆర్ధరైటిస్ సమస్య ఉంటే పాలకూర తినొచ్చా ?
అలానే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా పాలకూరను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. పాలకూరలో ఆక్సాలిన్ తో పాటు ప్యూరిన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది కీళ్ల నొప్పులతో బాధపడే వారికి మరింత ఇబ్బందిని కలిగిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పాలకూరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మూత్రపిండాల జబ్బులు, కీళ్ళ నొప్పులు వంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మినహాయించి మిగతావారు పాలకూరని తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications