health tips: వీటి వల్లే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్.. తెలుసుకోండి!!

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రతీ ఒక్కరికీ శ్రద్ధ ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో తరచు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఇంతగా పెరిగింది? అనేది ప్రతీ ఒక్కరికీ తెలియాలి.

ఎందుకు ఎక్కువ మంది గుండెపోటు, పక్షవాతం బారిన పడుతున్నారు. అసలు ఏ కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా పెరుగుతుంది అనే విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని సమస్యలు ఉన్నాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అలవాట్లు, కొన్ని పనులు మనలను మంచానికి పరిమితం చేసే అవకాశం ఉంది.

health tips: Risk of heart attack, brain stroke due to these issues.. Know!!

చాలామంది ఆరోగ్య సంబంధిత చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు అది ధమనులను అడ్డుకుంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు, మన శరీరంలో కొవ్వు పెరిగి అది హార్ట్ స్ట్రోక్ కు, బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. ఇక డయాబెటిస్ రోగులలో కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ రోగులలో నియంత్రణ లేని చక్కెర కూడా గుండెపోటు లకు, బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమవుతుంది.

ఇక ఊబకాయం కారణంగా కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు చాలా పెరుగుతాయి. దీనివల్ల కూడా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ధూమపానం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల కాలంలో ధూమపానం చేసేవారు పెద్ద సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు. వ్యాయామం లేకపోవడం, ఏమాత్రం శారీరక శ్రమ చేయకపోవడం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+