Health tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం.. జర భద్రం!!
వర్షాకాలం రానే వచ్చింది. వర్షాకాలంలో వర్షాలు పడితే అందరికీ ఆనందం కలుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వర్షాకాలంలో వర్షాలు పడటం వల్ల వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల రకరకాల క్రిములు భూమి నుండి బయటకు వస్తాయి. వర్షాకాలంలో మనకు తెలియని వివిధ కీటకాలు కూడా బయటకు వస్తాయి. అవి కుడితే చర్మ సమస్యలు, ఫంగస్ తో కూడిన పుళ్ళు ఏర్పడతాయి. అందుకే వర్షాకాలంలో చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా జాగ్రత్తగా ఉండాలి.

శరీరంపై దురద, దద్దుర్లు అనిపిస్తే వెంటనే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. వర్షాకాలంలో గాలిలోని తేమలో ఉండే బ్యాక్టీరియా కారణంగా కంటికి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం వుంది. కళ్ళు ఇన్ఫెక్షన్ కారణంగా ఎర్రబడి మంటగా అనిపిస్తాయి. వర్షాకాలంలో కళ్లకలక బాధిస్తుంది. అందుకే కళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం.
వర్షాలతో బ్యాక్టీరియా విస్తరించి, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం కలుషితం కారణంగా వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారం కలుషితమైతే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. కాబట్టి ఆహార కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

మురుగునీరు ఇంటి పక్కన నిల్వ లేకుండా చూసుకుంటే దోమల బెడద కాస్త తగ్గుతుంది. ఇక వర్షాకాలంలో వైరల్ ఫీవర్ లు, ఫ్లూలు, డెంగీ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కనుక వర్షాకాలంలో జ్వరం వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. వర్షాకాలంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మాంసాహారం, సీ ఫుడ్ లు, రోడ్ల పక్కన ఆహారానికి దూరంగా ఉండాలి. లేదంటే వీటివల్ల త్వరగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో తాగునీటిలో మురుగునీరు కలిసి కలుషితం అయ్యే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications