Health tips: ఆరోగ్యకరమైన ఈ పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి జాగ్రత్త!!
మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకుంటే అది మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. అయితే అదే పౌష్టికాహారం మోతాదును మించి తీసుకుంటే కొత్త అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. మనం తీసుకునే ఆహారంలో నాలుగు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కిడ్నీల సహాయంతో రక్తం శుద్ధి చేయబడుతుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ కూడా బయటకు పంపబడతాయి. కిడ్నీలు సరిగా పని చేయకపోతే అనేక వ్యాధులకు గురవుతారు. కాబట్టి మనం కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ అధిక వినియోగం వల్ల ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలి.

మనం తీసుకునే ఆహారం మన శరీరంలోని కిడ్నీలకు హాని చేయకుండా చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా పోషకాలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే పోషకాలను ఒక పరిధిలో మాత్రమే తినాలి. అలా కాకుంటే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండాలని చాలామంది వైద్యులు చెబుతుంటారు. అయితే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఆమ్లం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలకు ప్రమాదకరంగా మారుతుంది.
ఇక మనం తీసుకునే ఆహారంలో భాస్వరం అధికంగా ఉండే ఆహారం తింటే మన కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలతో ఈ ప్రమాదాన్ని మనం నివారించవచ్చు. మనం తీసుకునే ఆహారంలో అధికంగా పొటాషియం ఉన్నా కూడా అది మన మూత్రపిండాలకు హాని చేస్తుంది. అధికంగా పొటాషియం ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటే, పొటాషియంను ఫిల్టర్ చేయడానికి కిడ్నీలకు అధికంగా పని పడుతుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం కోసం పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను అధిక మోతాదులో తినకూడదు. సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను కూడా తినకూడదు.
సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక ఉప్పు కలిగిన ఆహారాన్ని తింటే కిడ్నీలు త్వరగా పాడైపోతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అధిక మోతాదులో తీసుకోకుండా ఉంటేనే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications