health tips: డయాబెటిస్ నియంత్రణకు ఈ వంటింటి చిట్కాలు ట్రై చెయ్యండి!!

డయాబెటిస్ ఇప్పుడు చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న జనాలు ఏం చేసినా సరే డయాబెటిస్ కంట్రోల్ కాక విసిగి వేసారి పోతున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేద, అలోపతి మందులతో పాటు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

వంటింటి చిట్కాలతో డయాబెటిస్ కంట్రోల్ చేసే ఆరోగ్యసూత్రాలు
అయితే ఆయుర్వేదంలో డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక వాటిని గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డయాబెటిస్ ను కంట్రోల్ చేయాలనుకునేవారు రాగి పాత్రలో నీటిని తాగడం చాలా మంచిది అంతే కాదు వంట చేసేటప్పుడు కూరల్లో ఆవాలు, పసుపు, మెంతిపొడి, దాల్చిన చెక్కపొడులను వేస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు అమాంతం పెరిగిపోకుండా అవి కట్టడి చేస్తాయి.

health tips Try these natural kitchen tips to control diabetes

కరివేపాకు, వేపాకుతో డయాబెటిస్ నియంత్రణ
అందుకే మనం వండుకునే కూరను బట్టి వాటిల్లో మనం పైన పేర్కొన్న కొన్ని పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకుంటే మంచిది. ఇక డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి కరివేపాకు ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కరివేపాకు తినడం కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. వేపాకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది.

ఆహారంలో ఇవి తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్
ఇక ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మెంతులను చేర్చితే లేదా మెంతుపొడిని చేర్చితే, మెంతికూరతో కూరలు వండుకుంటే డయాబెటిస్ కాస్త కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. కాకరకాయలను కలబందను తరచుగా తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు ప్రతిరోజు ఉదయాన్నే ఉసిరికాయలు తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కూడా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

ఒత్తిడి కంట్రోల్ చేసే ఈ నియమాలు పాటించాలి
ఇక అన్నం తినేటప్పుడు కొంచెం అన్నంలో దాల్చిన చెక్క పొడిని కానీ, మెంతి పొడిని కానీ కలుపుకొని తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తే కూడా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఒత్తిడితో కూడా డయాబెటిస్ బాగా పెరుగుతుంది. మనము ఒత్తిడిని తగ్గించుకోవడం డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+