health tips: విటమిన్-డి లోపం ఉందని చెప్పే ముఖ్యమైన లక్షణాలు!!
మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. విటమిన్-డి లేకపోవడం వల్ల శరీరంలో అనేక రకాలైన సమస్యలు వస్తాయి. శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందకపోవడం లేదా సరైన పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో విటమిన్-డి తగినంతగా అందకపోతే విటమిన్ డి లోపం వస్తుంది. ఇక మన శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలుసుకోవడానికి కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి శరీరానికి విటమిన్-డి చాలా ముఖ్యమైన పోషకమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని ఎముకల పటిష్టతకు, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డీ అవసరమని చెబుతున్నారు. విటమిన్ డి లోపం ఉన్నవారు తక్కువ వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటారు. విటమిన్-డి లోపం ఉన్నవారు తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు వాళ్లకి త్వరగా వస్తాయి.

విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులు చేసినా బాగా అలసటగా ఫీలవుతారు. అంతే కాదు విటమిన్ డి లోపం ఉన్నవారికి నిద్రలేమి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అకస్మాత్తుగా ఎముకల నొప్పి, కండరాల నొప్పి, కండరాల బలహీనత విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి.
విటమిన్-డి లోపం ఉన్నవారిలో విపరీతమైన దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వారిని వేధిస్తూ ఉంటాయి.తీవ్రంగా జుట్టు ఊడిపోవడం, శరీరంలో వాపు, నొప్పులు వంటి లక్షణాలు కూడా విటమిన్-డి లోపం వల్లనే కలుగుతాయి. అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి.
ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా విటమిన్-డి లోపం ఉందని గుర్తించి, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటుగా, ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి. సూర్యరస్మి మన శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. విటమిన్-డి లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుండి బయట పడినట్టే!!
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications