health tips: పెసరపప్పుతో బరువుకు చెక్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజూ తింటారు!!
పెసరపప్పును ప్రతి రోజు తినడం వల్ల అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెసరపప్పు నిండా పుష్కలంగా పోషకాలు ఉంటాయి. పెసరపప్పు లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మరియు అనేక ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. పెసరపప్పును ప్రోటీన్ల స్టోర్ హౌస్ అని చెప్పవచ్చు. అంత ఎక్కువగా పెసరపప్పులో ప్రొటీన్లు ఉంటాయి.
పెసలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత తిన్నా, ఉడకబెట్టుకొని తిన్నా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెసరపప్పును ప్రతి రోజు తినడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో నానబెట్టిన పెసలు తినడం మేలు చేస్తుంది. దీనిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల పెసరపప్పు శరీర కండరాలకు ఎంతో మేలు చేస్తుంది.

పెసరపప్పును నిత్యం తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మరింత పెరుగుతుంది. బరువు తగ్గాలని కోరుకునే వారు తమ ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే మొలకలు వచ్చిన పెసలు ఉడకబెట్టుకుని తింటే శరీరానికి కావలసిన శక్తి వస్తుందని, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు.
అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా పెసరపప్పు కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా పెసరపప్పు వల్ల అందుతాయని, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, దీనిని రోజూ తింటే మలబద్దకం సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. కచ్చితంగా ఉడకబెట్టిన పెసలను రోజు తినాలని చెబుతున్నారు. గుండె సమస్యలతో బాధపడేవారు పెసరపప్పును ఆహారంలో చేర్చుకుంటే దాని వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.
రక్తహీనత ఉన్నవారు పెసరపప్పు తినటం వల్ల లబ్ధిని పొందవచ్చు. పెసరపప్పులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తాన్ని వృద్ధి చెయ్యటానికి ఉపయోగపడుతుంది. అయితే తగిన మోతాదులో మాత్రమే పెసలను తినాలని, అలాకాకుండా అదే పనిగా అతిగా తిన్నా ఇబ్బంది వస్తుందని అంటున్నారు. బరువు తగ్గటం అటుంచి పెరుగుతారని అంటున్నారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పెసలను నిత్యం ఆహారంగా తీసుకోవడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications