health tips: జుట్టు ఊడిపోతుందా? ఇవిగో పరిష్కారాలు!!
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామంది ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్య. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బయట పొల్యూషన్, ఇతరత్రా అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు వెరసి జుట్టు రాలే సమస్య ఎక్కువగా మారింది. ముఖ్యంగా మహిళల్లో అయితే ఇది అతి పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.
అయితే జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్న వారు.. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి మళ్లీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంతకీ జుట్టు ఊడిపోకుండా కాపాడే ఆ చిట్కాలు ఏమిటంటే.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచితే జుట్టు రాలే సమస్య నుండి కాపాడుకోవచ్చు.

జుట్టు రాలకుండా ఉండేందుకు మనం తీసుకునే ఆహారం పోషకాహారంగా ఉండాలి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కంటినిండా నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలితో జుట్టు రాలకుండా ఉంటుంది.బాగా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది వారు ప్రతిరోజు హెయిర్ సీరమ్ లను ఉపయోగించడం మంచిది. అయితే హెయిర్ సీరం ఉపయోగించే విషయంలో జాగ్రత్త అవసరం.
కొంత ఆవాల నూనె ను ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేయాలి. స్టవ్ మీ ద వేడవుతున్న ఆ నూనెలో కొద్దిగా ఉసిరిముక్కలను, మెంతి విత్తనాలను వేసి కాసేపు అలాగే వేడి కానివ్వాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి వెంట్రుకల మొదళ్లకు పట్టించి ఆ రోజు రాత్రంతా ఉంచి మరుసటి రోజు, గాఢత తక్కువగా ఉండే షాంపూ తో స్నానం చేయాలి.

జుట్టు ఎక్కువగా రాలకుండా ఉండాలంటే హెయిర్ కలర్స్, గాఢత ఎక్కువగా ఉన్న షాంపూ లు, జుట్టును పాడు చేసే డ్రైయర్లు, కర్లర్స్ ఉపయోగించకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. మనకు సహజ సిద్ధంగా దొరికే పెరుగు, మెంతులు, మందార ఆకులు, మందార పూలు, వెల్లి పాయలు, ఉల్లిగడ్డలు, గోరింటాకు, కలబంద వంటి వాటిని జుట్టు ఆరోగ్యం కోసం ఉపయోగిస్తే మంచిది. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఎక్కువగా జుట్టు ఊడిపోకుండా కాపాడతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications