అసలు నిద్ర పోకుండా మనిషి ఎన్ని రోజులు జీవిస్తాడు? నిద్ర పోకుంటే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం పరుగుల ప్రపంచంలో చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవితంలో గాలిపీల్చడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, నీటిని తాగడం ఎంత అవసరమో నిద్రపోవడం కూడా అంతే అవసరం. అయితే ప్రస్తుత తరానికి నిద్ర పై శ్రద్ధ బాగా తగ్గుతుంది. సెల్ ఫోన్లు, లాప్టాప్ లకు అడిక్ట్ అవుతూ రాత్రి వేళల్లో తక్కువగా నిద్రపోతున్నారు. మన జీవ గడియారం సరిగా నడవడానికి నిద్ర చాలా ముఖ్యమైనది అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.

అటువంటి నిద్రకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. నిద్ర శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. మన శరీరం ఉత్సాహంగా ఉండేలా నిద్ర చేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజు కచ్చితంగా ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. ప్రతిరోజు నిద్రపోకపోతే ఏం జరుగుతుంది? అసలు నిద్రనే పోకపోతే మనిషి ఎంత కాలం జీవిస్తాడు వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

How many days can a man live without sleep? What happens if you dont sleep?

ప్రతిరోజు మనిషి కచ్చితంగా ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అలా నిద్రపోని వారిలో ఆ ప్రభావం ఉదయం చేసే పనుల పైన, ఉద్యోగం పైన కచ్చితంగా పడుతుంది. ఒకరోజు నిద్రపోకపోతేనే రెండవ రోజు చాలా చిరాకుగా ఉంటుంది. అటువంటిది అసలే నిద్రపోకుండా రోజుల తరబడి ఉంటే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. అసలే నిద్ర పోకుండా ఉండే వారిలో శారీరక, మానసిక రుగ్మతలు ప్రాణాల మీదకు తెస్తాయి.

ఇక మనిషి అసలే నిద్రపోకుండా ఎన్ని రోజులు జీవించగలడు అన్నదానిపై అనేక అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనాలలో నిద్రపోని వ్యక్తి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించారు. అసలే నిద్రపోని వ్యక్తిలో మూడు రోజుల తర్వాత నుండి నీరసం నిస్సత్తువ ఆవరిస్తాయి. కొద్దికొద్దిగా శరీరం పనిచేయడం మానేస్తుంది. మానసికంగా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అసలే నిద్రపోని వ్యక్తి 11 రోజులపాటు మాత్రమే జీవించి ఉంటాడు.

ఆ తర్వాత అతను పూర్తిగా మానసిక స్థితి దెబ్బతిని 12వ రోజున మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని నిద్ర విషయంలో అశ్రద్ధను పక్కన పెట్టి హాయిగా నిద్రపోతే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+