విటమిన్ డీ లోపం ఉందని తెలుసుకోవటం ఎలా? లక్షణాలు ఏంటి?
జీవితంలో డబ్బులు ఎంత ప్రధానమో అంతకంటే ఆరోగ్యం ప్రధానం. ఆరోగ్యం లేకుండా డబ్బులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుత సమాజంలో పరుగుల ప్రపంచంలో మారుతున్న జీవన శైలి కారణంగా ఏ ఇంట్లో చూసినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. మన శరీరానికి కావలసిన పోషకాలు లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డీ అవసరం
మనిషి ముఖ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. అయితే విటమిన్ డి లోపం అనేకమందిలో తీవ్ర అనారోగ్యాలకు కారణం అవుతుంది. మన శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందకపోవడం వలన మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను, ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందడం లేదు.ఫలితంగా విటమిన్ డి లోపం వస్తుంది.

విటమిన్ డీ లోపం ఉంటే లక్షణాలు ఇవే
ఇక విటమిన్-డి లోపం ఉన్నవారు అది ఎలా తెలుసుకోవాలి అంటే ... విటమిన్ డి లోపం ఉన్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్-డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. చిన్నపనులు చేసినప్పటికీ చాలా ఎక్కువ అలసటను ఫీల్ అవుతూ ఉంటారు. విటమిన్ డి లోపం ఉంటే నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. విపరీతమైన కండరాల నొప్పులు, ఎముకలు నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
విటమిన్ డీ లోపం ఉంటే డిప్రెషన్
అంతేకాదు మానసికంగానూ వీరి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగడం, డిప్రెషన్ కు గురి కావడం, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు విటమిన్ డి లోపంతో కనిపిస్తాయి. విటమిన్ డి లోపం ఉన్నవారిలో విపరీతమైన దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా వారిని ఇబ్బంది పెడతాయి.
విటమిన్ డీ లోపంతో జుట్టు ఊడిపోతుంది
శరీరంలో ఎక్కడపడితే అక్కడ వాపులు, నొప్పులు విటమిన్ డి లోపం ఉన్నవారిలోనే కలుగుతాయి. తీవ్రంగా జుట్టు ఊడిపోవడం కూడా విటమిన్ డి లోపం ఉన్నదని చెప్పడానికి సంకేతం. విటమిన్ డి లోపం ఉన్నవారు తరచూ అనారోగ్యాలకు గురవుతారు. తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి, చూడడానికి కూడా చాలా నీరసంగా కనిపిస్తారు. వీరికి జలుబు, దగ్గు, జ్వరం త్వరగా వస్తాయి.
విటమిన్ డి లోపాన్ని అధిగమిస్తే ఆరోగ్యం మీ సొంతం
చిన్నచిన్న వైరస్ లను, బ్యాక్టీరియాలను కూడా వీరు ఎదుర్కోలేరు. అందుకే ఎవరైతే ఇటువంటి లక్షణాలతో ఇబ్బంది పడతారో వారు విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి లోపాన్ని అధిగమిస్తే ఉత్సాహంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications