నడుం నొప్పిగా ఉంటే ఇలా చెయ్యండి... చాలా మంచి రిలీఫ్!
నడుం నొప్పి చాలా మందిని వేధించే సాధారణ సమస్య . సాధారణ సమస్య అయినప్పటికీ నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని ప్రాథమికంగా ఇంటిలోనే కొన్ని చక్కటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు . నడుమునొప్పి కోసం ఇంటి నివారణలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ చిట్కాలు సాధారణ నడుం నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువ సేపు పడుకోవడం వంటివి చెయ్యకూడదు.
నడుం నొప్పి నుండి ఉపశమనం కలిగించే చిట్కాలు
నడుము పైన ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అధిక ఒత్తిడి లేకుండా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు మంచం మీద పడుకునే ఉండడం మానుకోవడం మంచిది. ఈ విధంగా చేయడం కండరాలను బలహీనపరిచి నడుము నొప్పిని మరింత ఎక్కువ అయ్యేలా చేస్తుంది. సౌకర్యవంతమైన భంగిమలో పడుకోవడం, మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని వెనక్కి పడుకోవడం వంటివి చేస్తే కాస్త నడుం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

నడుం నొప్పి తగ్గించే రిలీఫ్ విధానాలు
ఇక నడుం నొప్పితో ఎక్కువ బాధ పడేవారు హీట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ పెట్టుకుంటే నడుము నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నడుము కండరాలకు ఉపశమనం కలిగించే ఎక్సర్సైజులు చేయడం కూడా మంచిది. కూర్చున్నప్పుడు లేదా నిలుచున్నప్పుడు నడుము భంగిమ సరైన విధంగా ఉండేలా చూసుకోవడం కూడా నడుము నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది.
మసాజ్ లతో నడుం నొప్పి నుండి ఉపశమనం
నడుం భాగంలో తేలికపాటి మసాజ్ లు చేసుకోవడం వల్ల కూడా కండరాల నొప్పి సడలి నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలివ్ నూనె, కొబ్బరి నూనెలతో మసాజ్ చేయడం వల్ల నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల కూడా కాస్త ఉపశమనం ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నడుం నొప్పిని తగ్గిస్తాయి.
ఈ చర్యలతోనూ నడుం నొప్పి నుండి ఉపశమనం
గోరువెచ్చని నీళ్లలో ఎప్సం సాల్ట్ కలిపి, ఆ నీళ్లలో ఒక క్లాత్ ను ముంచి, నడుము పైన కాపడం పెట్టడం వల్ల కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల కూడా నడుం కండరాలకు ఉపశమనం కలిగి నడుమునొప్పి తగ్గుతుంది. నడుమునొప్పి తగ్గడానికి తాత్కాలిక ఉపశమనం కోసం ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ వంటి టాబ్లెట్స్ కూడా నొప్పి నివారణ మందులు గా పనిచేస్తాయి.
నొప్పి ఎక్కువగా ఉంటే ఇలా చెయ్యండి
అయితే వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. ఇక నొప్పి తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే కాళ్లల్లో తిమ్మిరి, బలహీనత అనిపిస్తాయి. నొప్పి ఒక వారం కంటే ఎక్కువగా ఉంటే, మూత్ర విసర్జనలో ఇబ్బంది కలిగినా తక్షణం వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications