health tips: బరువు తగ్గి స్లిమ్ గా చేసే అద్భుతం గ్రీన్ కాఫీ.. బెనిఫిట్స్ చూడండి!!
ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి అతి పెద్ద సమస్య ఒబేసిటీ. ఒబేసిటి కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఒబేసిటీ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒబేసిటీని తగ్గించుకోవడానికి జీవనశైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం తోపాటు ఒక పానీయాన్ని తాగితే బరువు తగ్గి నాజూగ్గా, స్లిమ్ గా మారుతారని చెబుతున్నారు.
బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ మాత్రమే కాదు గ్రీన్ కాఫీ కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు గ్రీన్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం చాలామంది గ్రీన్ కాఫీ ని ఇష్టపడుతున్నారు.

గ్రీన్ కాఫీ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో క్లోరో జెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించి తద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది డిప్రెషన్ రాకుండా ఆపుతుంది ఫలితంగా మనసు కూడా ఆనందంగా ఉంటుంది. గ్రీన్ కాఫీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ కాఫీ కాలేయాన్ని మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మపు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ కాఫీ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది అంతేకాదు హార్మోన్లను కూడా నార్మల్ గా ఉండేలా చేస్తుంది.
గ్రీన్ కాఫీ లో ఉండే క్లోరో జెనిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేసి, దానిని గణనీయంగా తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. ఇక గ్రీన్ కాఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే.. గ్రీన్ కాఫీ గింజలను రాత్రిపూట నానబెట్టాలి.
ఉదయం నానబెట్టిన నీటిని వడ పోసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించి దానిలో తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి. ఈ కాఫీ తాగిన తర్వాత కనీసం పది నిమిషాల తర్వాత ఏదైనా తినాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications