ఐరన్ లోపమా... ఈ కూరగాయలు తింటే మాయం!
చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. ఐరన్ లోపంతో బాధపడేవారు ఇతర అనారోగ్య సమస్యలతో పీడించబడతారు. ముఖ్యంగా రక్తహీనత వీరిని ప్రధానంగా వేధిస్తుంది. అయితే ఐరన్ లోపాన్ని నివారించుకోవడానికి కొన్ని రకాల కూరగాయలు చాలా బాగా పనిచేస్తాయి. ప్రతి మనిషి శరీరంలో ఐరన్ సరిపడా ఉండడం ఎంతో అవసరం.
ఐరన్ లోపాన్ని నివారించే కూరగాయలు
ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఆ వ్యక్తులు నీరసంగాను, శక్తిహీనంగానూ ఉంటారు. ఐరన్ పుష్కలంగా ఉంటే వారు ఫుల్ ఎనర్జీతో ఉంటారు .ఇక ఐరన్ పుష్కలంగా ఉండే కొన్ని కూరగాయలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. మరి ఆ కూరగాయలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

బీట్ రూట్
ఐరన్ పుష్కలంగా ఉన్న కూరగాయలలో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఎంతో అవసరమైన ఐరన్ ను మన శరీరానికి అందిస్తుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ లోపాన్ని ఇది నివారిస్తుంది.
పచ్చి బఠానీలు
పచ్చి బఠానీలలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలను మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా పచ్చి బఠానీలు కాపాడతాయి.
పాలకూర
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక కప్పు పాలకూర తింటే 6.4 మిల్లీగ్రాముల ఐరన్ మన శరీరానికి అందుతుందని చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆహారంలో పాలకూరను భాగంగా చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీని అధిగమించవచ్చు. ఆకుకూరలు తినటం మనకు అన్ని విధాలుగా ఉపయోగం.
చిలగడదుంపలు, లీఫ్ క్యాబేజ్
చిలగడదుంప లో కూడా మన శరీరానికి కావలసిన ఐరన్ ను ఇచ్చే పోషకాలు ఉంటాయి. చిలగడ దుంపలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. లీఫ్ క్యాబేజీ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది .ఇది కూడా మన శరీరంలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. మనం క్రమం తప్పకుండా ఈ కూరగాయలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా మన శరీరంలోని ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications