ఈ వేసవిలో కివీ పండు చేసే ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ముఖ్యంగా పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ ను తినడం పొరపాటున కూడా మరిచిపోవద్దు.
కివి పండ్లలో ఫుల్ పోషకాలు
ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నాం. ఈ సీజన్లో దొరికే పండ్లను తింటే ఎంతో మంచిది. ఇక ఈ సీజన్లో మనం కివి పండును ఎక్కువగా తింటే మంచిదని చెప్పవచ్చు. కివి పండులో విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలతో మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ కివి పండును వేసవిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కివి పండ్లతో చర్మ ఆరోగ్యం
కివి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో కివి పండు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. కివి పండ్లు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. కివి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.
కివి పండుతో గుండె ఆరోగ్యం
కివి పండ్లు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కివి పండులో ఉండే పోషకాలు విటమిన్ సి, పాలిఫెనాల్స్, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కివి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా మన కంటి చూపు మెరుగు పడుతుంది.
కివి పండ్లతో శరీరంలో మంచి బ్యాక్టీరియా
చైనా, తైవాన్ ప్రధాన భూభాగానికి చెందినది అయిన కివి పండు న్యూజిలాండ్, కాలిఫోర్నియా వంటి దేశాలలో వాణిజ్యపరంగా బాగా పండిస్తారు. ప్రస్తుతం మనదేశంలో కూడా ఇది అన్ని ప్రాంతాలలోనూ అందుబాటులో ఉంది. కివి పండును చైనీస్ గూస్ బెర్రీ అని పిలుస్తారు. కివి పండ్లను తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
బీపీని, డయాబెటిస్ ను కంట్రోల్ చేసే కివీ పండు
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కివీ ఉపశమనం కలిగిస్తుంది. బీపీని, డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారణకు ఎంతగానో దోహదం చేస్తుంది. మన బరువు తగ్గడానికి కూడా కివి పండు అద్భుతంగా పనిచేస్తుంది.












Click it and Unblock the Notifications