చుక్కకూర తింటే మీ ఆరోగ్యంలో కలిగే అద్భుతమైన మార్పులివే!
మన ఆహారంలో ఆకుకూరల పాత్ర చాలా గొప్పది. ఆకుకూరలు తింటే బోలెడంత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర ఇలా ప్రతి ఆకుకూరలోనూ మన ఆరోగ్య సంరక్షణకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చుక్కకూర గురించి తెలుసుకుందాం.
చుక్కకూరతో ఆరోగ్యం
చుక్కకూర తినడానికి పుల్లగాను, కాస్త గోంగూరకు దగ్గరగాను అనిపించే ఆకుకూర. ఈ ఆకుకూర తినని వారు చాలామంది ఉన్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే చుక్కకూరను కచ్చితంగా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యంలో బోలెడన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వారంలో ఒకటి రెండుసార్లు చుక్కకూరను తింటే ఎంతో మంచిది.

చుక్కకూరలో ఫుల్ పోషకాలు
చుక్కకూరలో విటమిన్ సి, విటమిన్ కే, లూటిన్, బీటా కెరోటిన్, ఐరన్, మెగ్నీషియం, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చుక్కకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. రక్తనాళాల పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది. బీపీని తగ్గిస్తుంది.
చుక్కకూరతో బీపీ, క్యాన్సర్ లకు చెక్
గుండెకు రక్త సరఫరా చేసే నాళాలలో పూడికలు లేకుండా చూస్తుంది. అంతేకాదు మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటివి రాకుండా చుక్కకూర నివారిస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో చుక్కకూరలో ఉండే ఐరన్ బాగా సహాయపడుతుంది. తరచూ చుక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను చుక్కకూర తగ్గిస్తుంది.
చుక్కకూర ఇమ్యూనిటీ బూస్టర్
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి కూడా చుక్కకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను చుక్కకూర తగ్గిస్తుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చుక్కకూరను తరచు ఆహారంలో తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి చుక్క కూర కాపాడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే చుక్కకూరను ఆహారంలో భాగంగా చేసుకోవటం అస్సలు మరచిపోవద్దు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications