జొన్నరొట్టెలు తింటే మీ శరీరంలో జరిగే మార్పులు తెలుసుకోండి!

ప్రస్తుతం సమాజంలో మనం తినే ఆహారమే మనకు అనారోగ్యాలను తెస్తుందని ఎంతోమంది చెబుతున్నారు. మనం తినే ఆహారంలో కల్తీ కారణంగా మనం అనారోగ్యం బారిన పడుతున్నామని హెచ్చరిస్తున్నారు. ఇక మారుతున్న జీవనశైలి కారణంగా కూడా మనం తినే ఆహారం మన శరీరాన్ని రోగగ్రస్తంగా చేస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

జొన్న రొట్టెలపై ఆసక్తి
ఇందులో భాగంగా జొన్న రొట్టెలు తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. జొన్న రొట్టెలు తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. జొన్నలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు రాత్రిపూట చపాతీల బదులు చాలామంది జొన్న రొట్టెలు తింటున్నారు. జొన్నల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా జొన్న రొట్టెలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు.

Know the changes that happen in your body if you eat jowar roti

జొన్న రొట్టెలు బలవర్ధకమైన ఆహారం
జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం. జొన్న రొట్టెల వల్ల ఎముకలు బలంగా ఉంటాయని జొన్న పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు త్వరగా అరుగుతాయని, దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని చెబుతున్నారు. జొన్న రొట్టెలు బరువు పెరగకుండా చూస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది.

గుండె జబ్బులు, ఒబేసిటీ తగ్గించే జొన్న రొట్టెలు
జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడుతుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా జొన్న రొట్టెలను తీసుకుంటే గుండె ఆరోగ్యం పడటమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

జొన్నలలో పోషకాలు పుష్కలం
డయాబెటిస్ తో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణం జొన్న రొట్టెలకు ఉంది. జొన్నలలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బి త్రీ వంటి ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. క్యాన్సర్ వంటి సమస్యలను దగ్గరకు రాకుండా చేస్తాయి.

ఆహారంగా జొన్న రొట్టెలు బెస్ట్
రక్తహీనత సమస్య నుంచి జొన్న రొట్టెలను తింటే బయటపడొచ్చు. జొన్న రొట్టెలు మలబద్దకాన్ని దూరం చేసి గట్ హెల్త్ కోసం బాగా ఉపయోగపడతాయి. కనుక జొన్నల లో ఉండే పోషకాలను తెలుసుకొని జొన్న రొట్టెలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+