ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్.. ఈ సీజన్ లో ఇలా చేసి తింటే రుచి అదుర్స్!

వింటర్ సీజన్లో ఏం తినాలన్నా కాస్త వేడిగా, స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు మన నోటికి కూడా రుచి తెలిసే విధంగా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ గురించి ఈరోజు చెప్పుకుందాం. చాలా ఈజీగా, టేస్టీగా ,డిఫరెంట్ గా తయారు చేసుకునే ఈ రెసిపీ ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్.

ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు
వండిన అన్నం- రెండు కప్పులు
ఆవకాయ పచ్చడి- ఒకటిన్నర టేబుల్ స్పూన్
పప్పు- అరకప్పు ఉడికించినది
ఉల్లిపాయ- సన్నగా తరిగినది ఒకటి
పచ్చిమిర్చి- సన్నగా తరిగినవి
కరివేపాకు- రెండు రెమ్మలు
పసుపు- ఆఫ్ టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా

make delicious Avakaya Pappu Fried Rice super recipe in this winter season

తయారీ విధానం
ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడి చేసి అందులో నూనె వేయాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత అందులో కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించిన పప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.

ఆవకాయ అన్నం కలిసేలా ఫ్రై చేసుకోవాలి
అయితే పప్పును బాగా మెత్తగా ఉడికించుకోకూడదు. ఆ తర్వాత అందులో ఆవకాయ పచ్చడి లోని నూనె, మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆపై వండిన అన్నం వేసి మెల్లగా కలుపుకోవాలి. మొత్తం ఆవకాయ అన్నం కలిసేలా ముద్దగా కాకుండా ఫ్రై చేసుకోవాలి. చివరలో కొత్తిమీర చల్లి, కావాలనుకుంటే ఆవకాయ ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.

వింటర్ సీజన్ లో హాట్ హాట్ గా
ఫ్రైడ్ రైస్ చేసే క్రమంలో ఆవకాయ నూనెతోనే దీనిని ఫ్రై చేసినప్పుడు దీని రుచి పెరుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ వింటర్ సీజన్లో హాట్ హాట్ గా చాలా తక్కువ సమయంలో వండుకునే ఆవకాయ పప్పు ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+