భోజనంలో కరివేపాకుని తీసి పారేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!

మనం నిత్యం కూరలలో కరివేపాకుని వాడుతూ ఉంటాం. అయితే భోజనం చేసేటప్పుడు చాలామంది కరివేపాకును తీసి పక్కన పెడుతూ ఉంటారు. కరివేపాకును అస్సలు తినరు. అయితే కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వాళ్లకు తెలియక తీసి పక్కన పడేస్తూ ఉంటారు కరివేపాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినవారు దానిని అస్సలు తినకుండా వదిలిపెట్టరు. మరి ఇంతకీ కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కరివేపాకులో ఉండే పోషకాలు ఇవే
కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కరివేపాకులో విటమిన్ సి ఉంటుంది. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్స్ ఎక్కువగా ఉంటాయి. కరివేపాకులో నికోటిన్ ఆమ్లం తో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, ప్లాస్టిస్టెరాల్స్ ,అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.

Many health benefits with curry leaves eat regularly for healthy life

కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు
ఇక కరివేపాకుతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి.కరివేపాకుని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కరివేపాకు తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

కరివేపాకుతో డయాబెటిస్ కంట్రోల్
చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి కరివేపాకు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని బాగా తగ్గిస్తుంది. కరివేపాకు గ్యాస్ట్రో సమస్యలను తగ్గిస్తుంది. పలు రకాల క్యాన్సర్ల నివారణకు కరివేపాకు పనిచేస్తుంది. కరివేపాకు ఎముకల అరుగుదలను, అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది.

కాలేయాన్ని కాపాడే కరివేపాకు
జీర్ణ సమస్యలకు కరివేపాకు దివ్య ఔషధం. బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ లతో కరివేపాకు పోరాడుతుంది. హెపటైటిస్ , సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కరివేపాకు రక్షిస్తుంది. కాబట్టి కరివేపాకే కదా అని తీసి పక్కన పెట్టకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోండి. భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా తీసి పారేయకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+