మటన్ ఫ్రై.. ఇలా చేస్తే పండుగకు కడుపు నిండా తింటారు!
పండుగ ఏదైనా సరే మనవాళ్లు నాన్ వెజ్ తినడం కామన్. ఒక సంక్రాంతి పండుగ సందర్భంగా కొందరు సంక్రాంతి పండుగనాడు నాన్ వెజ్ లాగిస్తే, ఎక్కువమంది కనుమపండుగ నాడు నాన్ వెజ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఏపీలో కనుమపండుగ నాడు మటన్, చికెన్, చేపలు వంటి నాన్ వెజ్ ఆహారాలను వండుకుంటారు. అయితే ప్రస్తుతం పండుగనాడు కడుపునిండా తినేలా మటన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మటన్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
మటన్ - ఒక కిలో
ఉల్లి గడ్డలు పెద్దవి - 2 ( సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1.5 స్పూన్లు
పచ్చిమిర్చి - 4 కట్ చేసి పెట్టుకున్నవి
కారం - ఒకటిన్నర స్పూన్లు
ఉప్పు- ఒకటిన్నర స్పూన్లు
ధనియాల పొడి- రెండు స్పూన్లు
గరం మసాల- ఒక స్పూను
నూనె- మూడు స్పూన్లు
పసుపు- అర స్పూను

తయారీ విధానం
మటన్ ఫ్రై చేయడానికి ముందుగా కుక్కర్లో మటన్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి, కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. మటన్ ముక్క తుంచితే తునిగిపోయేలా ఉడికిన తర్వాత ఆ మటన్ ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన పాన్ పెట్టుకుని మూడుస్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
ఇలా చేస్తేనే రుచి
అందులో ఒకటిన్నర స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని, అందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఆపై అందులో కొద్దిగా పసుపు, ఒకటిన్నర స్పూను ఉప్పు, ఒకటిన్నర స్పూను కారం వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మళ్లీ అందులో గరం మసాల యాడ్ చేయాలి.
ఈ మటన్ ఫ్రై పండుగకు ట్రై చెయ్యండి
మళ్లీ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాల పొడిని కూడా యాడ్ చేసి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మటన్ కు పట్టిన తర్వాత మటన్ బాగా ఫ్రై అయింది అని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో, కొద్దిగా నిమ్మరసంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగకు మటన్ వండుకోవాలి అనుకునేవారు ఈ ఫ్రై ని ఒకసారి ట్రై చేసి చూడండి.












Click it and Unblock the Notifications