400ఏళ్ళ నమ్మకం.. ఈ నూనెతో చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం.. ట్రై చెయ్యండి!

మన ఆరోగ్యానికి దోహదం చేసే నూనెలు అనేకం ఉన్నాయి. అటువంటి నూనెలలో వేప నూనె ఒకటి. వేప నూనె వేప చెట్టు నుంచి తీసే నూనె. ఈ నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 400 సంవత్సరాలకు పైగా వేప నూనె మన ఆరోగ్య సంరక్షణకు, ముఖ్యంగా జుట్టు, చర్మ సంరక్షణకు దోహదం చేస్తుందని ఆయుర్వేదం చెప్పింది. సాంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వేప నూనెను ఉపయోగిస్తారు.

వేప నూనెతో చర్మ ఆరోగ్యం
వేప నూనెను ఉపయోగించడం వల్ల మన చర్మ ఆరోగ్యం బాగుంటుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో వేప నూనె ఒక ప్రసిద్ధమైన నూనె. దాని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వేప నూనె మన స్కిన్ అలర్జీ లను తగ్గించడానికి తామర, సోరియాసిస్, మొటిమలు మరియు పొడి చర్మం వంటి సమస్యలకు ఉపయోగిస్తారు.

Neem oil is enough for beautiful skin and healthy hair Try it

జుట్టు ఆరోగ్యాన్ని వేపనూనె
వేప నూనెలో ఉండే విటమిన్ ఈ మరియు ఫ్యాట్స్ మన చర్మానికి నిగారింపును ఇస్తాయి. ఇక వేప నూనె జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది తలలో ఇన్ఫెక్షన్లతో పాటు, చుండ్రు పైన కూడా పోరాటం చేస్తుంది. క్రమం తప్పకుండా వేప నూనెను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు బలం పెరుగుతుంది. వేప నూనె జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది.

వేపనూనెతో గాయాలు, చర్మపు పూతలకు చెక్
సాంప్రదాయ వైద్యంలో కూడా వేప నూనె అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వేప నూనెతో గాయాలు, చర్మపు పూతలు తగ్గుతాయి. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి కూడా వేప నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఇది కాపాడుతుంది. వేప నూనె మొటిమల నివారణకు ఉపయోగపడుతుంది. మొటిమల కారణంగా ఏర్పడే మచ్చలను తొలగించడానికి యూజ్ అవుతుంది.

టాక్సిన్స్ ను తొలగించడానికి వేప నూనె
మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి వేప నూనెను వేసుకుని మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. వేప నూనెను కీళ్ళనొప్పులకు కూడా మర్దన నూనెగా ఉపయోగించవచ్చు. ఇది రాసుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న వేప నూనెను ఉపయోగించడం ఎంతో మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+