శరీరంలో ఈ వ్యవస్థనే మెయిన్.. పని చెయ్యకుంటే ఎన్ని కోట్లున్నా దండగే!
మన శరీరంలో సందేశాలను శరీరానికి అందించడానికి, కండరాల కదలికలను నియంత్రించడానికి, వివిధ సమాచారాలను మెదడుకు చేరవేయడానికి, అవయవాలు విధులను నిర్వర్తించడానికి నరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అటువంటి నరాల ఆరోగ్యం చాలా కీలకమైనది. శరీరంలో నాడీ వ్యవస్థ పని చేయకుంటే ఎన్ని కోట్ల డబ్బున్నా వేస్ట్అని చెప్పటం తప్పేం కాదు.
నరాల పాత్ర శరీరంలో చాలా ముఖ్యం
మెదడు నుండి మొదలయ్యే కపాల నరాలు, వెన్నుపాము నుండి ప్రారంభమయ్యే వెన్నుపాము నరాలు శరీరంలోని వివిధ భాగాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. ఫ్రెనిక్ నరాలు శ్వాసక్రియలో కీలక భూమిక పోషిస్తాయి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనేది ప్రతీది నాడీ వ్యవస్థ చేతిలోనే ఉంటుంది.

నరాల ఆరోగ్యానికి ఇవి తప్పనిసరిగా ఉండాలి
నరాల ఆరోగ్యం పైన ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. నరాల ఆరోగ్యం కోసం మన శరీరానికి విటమిన్ బి12, విటమిన్ బి 6, విటమిన్ బి3, బి1 తోపాటు మొక్కల ఆధారిత ఆహారాలు క్రమబద్ధమైన వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి . బి విటమిన్లు నరాల నష్టాన్ని తగ్గించడంలో, తిమ్మిర్లు, జలదరింపులు వంటి లక్షణాలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి.
నరాల ఆరోగ్యానికి ఇవి తినాలి
నరాల ఆరోగ్యం కోసం విటమిన్ బి అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరిగా చేయడం చేయాలి నరాల ఆరోగ్యానికి సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, బెర్రీలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు నరాల నొప్పులు, వాపులు తగ్గించి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే నరాల ఆరోగ్యం
ఆహార లోపాలను తగ్గించడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అంతేకాదు మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం కూడా నరాల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నరాల ఆరోగ్యం పైన ఎటువంటి అనుమానం వచ్చినా, నొప్పులు, వాపులు వంటివి ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేస్తేనే అవయవాలు సరిగ్గా పని చేసేది
నరాల ఆరోగ్యం చాలా ముఖ్యం ఎందుకంటే మన నాడీ వ్యవస్థ పని చేస్తేనే మన శరీరంలోని అవయవాలన్నీ నాడీ వ్యవస్థ ఇచ్చే సంకేతాలను విని పనిచేస్తాయి. అది సరిగ్గా పనిచేయకపోతే మన శరీరం మూలకు పడ్డట్టే. కాబట్టి ఎవరు పొరపాటున కూడా నరాల ఆరోగ్యాన్ని విస్మరించకూడదు. ఒకవేళ విస్మరిస్తే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications