కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలను తినొద్దు!

చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు వృద్ధాప్యం వచ్చిన వారికి వచ్చే కీళ్లనొప్పుల సమస్య ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు? వంటి అనేక విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

కీళ్ళ నొప్పులకు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం
కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే నొప్పులు తీవ్రతరం అవుతాయి. కొన్ని రకాల ఆహారాలు కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. అటువంటి ఆహారాలను తీసుకోకుండా ఉంటేనే మంచిది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ముఖ్యంగా తీసుకోకూడని ఆహారాలను చూద్దాం.

People with arthritis and joint pains should not eat these foods

దుంప కూరలు, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దుంప కూరలు తినకూడదు. ఆలుగడ్డ, చేమ గడ్డ, కంద గడ్డ వంటి వాటిని తినకుండా ఉంటేనే మంచిది. దుంప కూరలతో కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. ఇక కీళ్లనొప్పులతో బాధపడేవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. కీళ్ల నొప్పులకు ఉప్పు ఒక కారణం అవుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే కీళ్ల నొప్పి తీవ్రతరమవుతుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆహారంలో ఉప్పును తక్కువగా తినాలి.

కీళ్ళ నొప్పులతో ఇవి తింటే డేంజర్
కీళ్ల నొప్పులతో బాధపడేవారు తీపి పదార్థాలను కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువ తీపి పదార్థాలను తింటే కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. వీటివల్ల కణాలకు, కీళ్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, సోడాలు, ఐస్క్రీమ్లు వంటివి కీళ్లనొప్పులు ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడేవారు శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలను, రెడీ టు ఈట్ ఆహారాలను అసలు తినకూడదు.

కీళ్ళ నొప్పులతో బాధ పడేవారు వీటికి దూరంగా ఉండాలి
ఇవి కీళ్ల మధ్య మంటను మరింత ఎక్కువ చేసి ఇబ్బందికి కారణమవుతాయి. ఇక ఆల్కహాల్ తాగే వారిలోనూ కీళ్లనొప్పులు అధికంగా వచ్చే ఆల్కహాల్ తాగడం కారణంగా శరీరంలో ఉండే నీరు, పోషకాలు తగ్గిపోతాయి ఇది కీళ్లనొప్పిని మరింత పెంచుతుంది. దీనివల్ల ఇబ్బంది పడతారు. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెడ్ మీట్ ను ఎక్కువగా తినకూడదు. రెడ్ మీట్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే రెడ్ మీట్ ను తినకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+