ఈ సమస్యలున్న వారు కందిపప్పు తినొద్దు!
మనం తీసుకునే ఆహారంలో పప్పు దినుసుల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిగణించబడుతుంది. పప్పులలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు. ప్రస్తుతం మనం కందిపప్పు గురించి తెలుసుకుందాం. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కందిపప్పు తింటే చాలా ప్రయోజనాలు
కందిపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కందిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే కందిపప్పు తింటే మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మన జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కందిపప్పు మన బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది.

కందిపప్పు తింటే ఈ మేలు
కందిపప్పులో ఉండే ప్రోటీన్లు మనకు ఆకలిని తగ్గించి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఫలితంగా మనం ఆహారాన్ని తక్కువ తీసుకుంటాం. కాబట్టి దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అధిక రక్తపోటు ఉన్నవారికి కందిపప్పు తీసుకోవడం మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
కందిపప్పుతో సమస్యలు కూడా
కండరాల నిర్మాణానికి కందిపప్పు దోహదం చేస్తుంది. కందిపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్న కందిపప్పును కొంతమంది తీసుకోకుండా ఉంటేనే మంచిది. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే కందిపప్పుని ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది.
యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే కందిపప్పు తినొచ్చా
కందిపప్పులో ప్యూరిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ప్యూరిన్ల ప్రభావం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరుగుతుంది. కీళ్ల నొప్పుల సమస్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కందిపప్పు తినడం మంచిది కాదు. కందిపప్పులో ఆక్సలైట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇతర సమస్యలు తలెత్తుతాయి.
కందిపప్పుతో ఈ సమస్యలు కూడా
కందిపప్పులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సార్లు కందిపప్పు తింటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా కందిపప్పును తింటే బరువు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు కందిపప్పును తక్కువగా తినడమే మంచిదని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications