సంతోషానికి ఆహారానికి లింక్: మీరెప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినండి!!

జీవితంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే ప్రస్తుత మానవుల జీవనశైలి పని విధానం వారిని సంతోషంగా ఉండనివ్వటం లేదు. విపరీతమైన పని ఒత్తిడి వల్ల శరీరంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. మనం సంతోషంగా ఉండడం లేదా విషాదంగా ఉండడం అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. సంతోషానికి ఆహారానికి లింక్ ఉంటుంది.

మనకు సంతోషాన్ని కలిగించే హార్మోన్లు కొన్ని రకాల ఆహారపదార్థాలను తిన్నప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు. సంతోషకరమైన హార్మోన్ల స్రావాన్ని పెంచే కొన్ని రకాల ఆహార పదార్ధాలు సంతోషానికి కారణమవుతాయని, వాటిని మనం ఆహారంలో తీసుకోవడం వల్ల మనం సంతోషంగా జీవించగలుగుతాం అని చెబుతున్నారు.

Relation between food and happiness Eat These Super Foods to Always Be Happy

ఇక అటువంటి ఆహారాలలో ముఖ్యమైనది బచ్చలి కూర. ప్రతిరోజు మీ ఆహారంలో బచ్చలి కూరను తీసుకుంటే సంతోషకరమైన హార్మోన్ల స్రావాన్ని పెంచడంలో, మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన క్రమంగా తగ్గుతుంది. ఇది మన శరీరంలోని సంతోషకరమైన హార్మోన్ల స్రావాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్ ఫిష్ కూడా మన సంతోషాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మెదడు పనితీరును పెంచడంతోపాటు, మానసిక స్థితిని మెరుగుపరిచి మనం సంతోషంగా ఉండేలా చేస్తుంది.బ్లూ బెర్రీస్ తీసుకోవడం వల్ల కూడా మనసు ఉల్లాసంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

ఇక అదే విధంగా అవకాడో ను మూడు బూస్టింగ్ ఫుడ్ అంటారు. విటమిన్ b6 మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండే అవకాడో మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఈ ఆహారాలను తినడం అసలు మర్చిపోవద్దు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+