ఈ నూనె వాడితే నవ యవ్వనం, సౌందర్యం డబుల్!

చాలామంది నేటి రోజుల్లో అందం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. అంతే కాదు చాలా యాంటీ ఏజింగ్ క్రీములను కూడా ఉపయోగిస్తున్నారు. ముఖం మీద ముడతలు రాకుండా, అకాల వృద్ధాప్యం రాకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. అయితే వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారించటం కోసం కొన్ని రకాల ఆయిల్స్ వాడుతున్నారు. అటువంటి వాటిలో ఒక బెస్ట్ ఆయిల్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.

గంధపు నూనెతో చాలా లాభాలు
గంధపు నూనె యాంటీ ఏజింగ్ ఆయిల్ గా చాలా బాగా పని చేస్తుంది. గంధపుచెట్టు నుండి గంధపు నూనెను తయారు చేస్తారు. గంధపు చెక్కల నుండి తయారయ్యే ఈ సుగంధ భరితమైన గంధపు నూనె మన చర్మ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది.. ఈ నూనె అన్ని శారీరక, మానసిక రుగ్మతల యొక్క చికిత్సల కోసం ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. గంధపు నూనెను మానసికంగా మనం రిలాక్స్ అవ్వటానికి ఉపయోగిస్తారు.

sandal wood oil is best anti aging oil Many more benefits with this oil

గంధపు నూనె సహజమైన మాయిశ్చరైజర్
గంధపు నూనె ఒక అద్భుతమైన సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. గంధపు నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరంపై వచ్చే రాష్ మరియు వాపు వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచుతుంది.అన్నిటికంటే ముఖ్యంగా గంధపు నూనెలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా కాపాడతాయి.

చర్మానికి, జుట్టుకు బెస్ట్ గంధం నూనె
గంధపు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ తో పాటు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన ముఖంపై వచ్చే మొటిమలను నయం చేయడానికి చర్మం పై ఉన్న మచ్చలు, మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయి. గంధపు నూనెలో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. చర్మానికి, జుట్టుకి, ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా దీనిని అందం ఇనుమడింప చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

గంధపు నూనెతో ఈ సమస్యలకు పరిష్కారం
గంధపు నూనెతో ఎగ్జిమా, సోరియాసిస్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి . ఇది చర్మం యొక్క అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది . గంధపు నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది . కాబట్టి అనేక సమస్యలకు గంధపు నూనె చక్కని పరిష్కారం. వాడే ముందు. కాస్త చేతికి రాసుకుని టెస్ట్ చేసుకున్నాకే మీ స్కిన్ కు సరిపడితేనే వాడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+