నువ్వులు vs పల్లీలు .. మీ ఆరోగ్యానికి ఏది మంచిది? తెలుసుకోండి!
మనం ఆరోగ్యంగా ఉండటం కోసం అనేక రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. అటువంటి ఆహారాలలో పల్లీలు, నువ్వులు చెప్పుకోదగినవి. నువ్వులతో చేసిన ఆహారాలు పల్లీలతో చేసిన ఆహారాలు మన శరీరానికి కావలసిన శక్తినిస్తాయని ఇవి రెండు ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తో కూడుకున్న పోషక ఆహారాలని చెబుతారు.
పల్లీలు, నువ్వులు ఏది మంచిది
చాలామందికి ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని అనుమానాలు ఉంటాయి? ఇక ఈ రెండింటినీ కలిపి తింటే ఏం జరుగుతుంది? అనేది కూడా చాలా మందికి తెలియదు. అటువంటివారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.

నువ్వులు ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ లు ఉంటాయి. అంతేకాదు నువ్వులలో మన రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే సెసమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. నువ్వులను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. నువ్వులను నూనెగా పిండిగా లేదా పేస్టుగా చేసుకోవచ్చు. నువ్వులతో రకరకాల మిఠాయిలు, రొట్టెలు ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన శరీరానికి కావలసిన శక్తినిస్తాయి.
పల్లీలు ఆరోగ్య ప్రయోజనాలు
మొక్కల ఆధారిత ప్రోటీన్ అయిన పల్లీలు మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులకు గొప్ప మూలం. పల్లీలు మన శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి దోహదం చేస్తాయి. పల్లీలు మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఇక పల్లీలను వేయించుకుని కానీ, ఉడకబెట్టుకొని కానీ తినవచ్చు. ఆహారాలలో కూడా అనేక రకాలుగా పల్లీలను ఉపయోగించుకుంటారు. శక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడతాయి.
రెండూ కలిపి తింటే పుష్కలంగా శరీరానికి కావాల్సిన పోషకాలు
ఈ రెండింటిలో ఏది మంచిది అనేది ఎవరికి వారికి వారి ఆరోగ్య లక్ష్యాలు మరియు ఆహార అవసరాలను బట్టి ఉంటుంది. అయితే ఈ రెండింటిని కలుపుకుని తింటే మాత్రం చాలా మంచిదని శరీరానికి కావలసిన పోషకాలు ఫుల్లుగా వస్తాయని చెబుతారు. జీర్ణక్రియను మెరుగుపరిచి ఇమ్యూనిటీని పెంచుతాయని రక్త కణాలను రిపేర్ చేస్తాయని ఎముకలకు కీళ్లకు మంచి జరుగుతుందని, అధిక బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుందని చెబుతారు.












Click it and Unblock the Notifications