బాగా పెరుగుతున్న స్లీపింగ్ డైవర్స్ ట్రెండ్.. అసలిదేంటి? మంచిదా.. కాదా?
ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డైవర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు రూముల్లో పడుకుని తెల్లవారుజామున మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డైవర్స్ అంటారు.
స్లీపింగ్ డైవర్స్ ట్రెండ్
సాధారణంగా భార్యాభర్తలు అంటే కలిసి పడుకుంటారు దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్యనిపుణులు చెబుతారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిది అని చాలామంది చెబుతున్నారు. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండును ఫాలో అవుతున్నట్టుగా చెబుతున్నారు.

భాగస్వాముల నిద్రలో అసమానతల కారణంగా స్లీపింగ్ డైవర్స్
భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరి వల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవడానికి సపరేట్ రూమ్స్ ను ఎంచుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య గురక సమస్య, ఒకే దుప్పటిని ఇద్దరూ పంచుకునే సమస్య ఉంటే స్లీపింగ్ డైవర్స్ ను ఫాలో అవుతున్నారు.
స్లీపింగ్ డైవర్స్ తో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా?
రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా చాలామంది జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డైవర్స్ తో అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. దీంతో లాభనష్టాలు రెండు ఉంటాయని చెబుతున్నారు.
ఎవరి వెర్షన్ వారిదే
నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజు కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డైవర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications