అందం, ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటున్న సమంత డైట్ సీక్రెట్స్ ఇవే!
అందంగా, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ప్రతీ ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే అందం, ఫిట్ నెస్ విషయంలో కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సమంత రుతు ప్రభు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఫేమస్ ఫిల్మీ సెలబ్రిటీ. సమంతకు నేటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది.
సమంత డైట్ ప్లాన్
రోజు రోజుకి వయసు పెరుగుతున్నప్పటికీ సమంత తన అందంతోను, తన ఫిట్నెస్ తోను అందరిని ఆకట్టుకుంటుంది. జిమ్ చేసే సమంత తను అందంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం ఒక నిర్దిష్ట డైట్ ప్లాన్ ను పాటిస్తుంది. సమంత వెజిటేరియన్. వెజిటేరియన్ ఫుడ్ లోనే సమంత డైట్ ప్లాన్ ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలో చేస్తున్న సమంత
సమంత తాను తీసుకునే డైట్ గురించి ఒక పాడ్ కాస్ట్ లో తానే స్వయంగా కీలక విషయాలను చెప్పింది. ఇక సమంత చెప్పిన విషయాల ప్రకారం సమంత యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ను పాటిస్తున్నానని చెప్పింది. తాను చిన్నప్పుడు బరువు పెరిగే దాన్ని కాదు కాబట్టి ఏది తినాలనిపిస్తే అది తినేదాన్ని అని, కానీ ఇప్పుడు కఠినమైన డైట్ చేస్తున్నాను అంటూ తెలిపారు.
తన డైట్ ఎలా ఉంటుందో చెప్పిన సమంత
తన ఆహారం ప్రతిరోజు ఒకేలా ఉంటుందని, తాను ఎప్పుడు చీట్ మీల్స్ తీసుకోనని సమంత పేర్కొంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న క్రమంలో తాను తన ఆహారం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని పేర్కొంది. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పసుపు, దాల్చిన చెక్క, డ్రై ఫ్రూట్స్ వంటివి ఆహారంలో ఉంటాయని, తాను ఒత్తిడికి గురవ్వని, ఎలాంటి మంట రాని సాత్విక ఆహారాన్ని తీసుకుంటానని సమంత తెలిపారు.
సమంత ఈ పదార్ధాలు అసలే తీసుకోరు
సమంత తన రోజును పండ్లు, గింజలు మరియు ఓట్స్ తో ప్రారంభిస్తుంది. ఆమె మాంసాహారం, పాల ఉత్పత్తులు తీసుకోరు. ప్లాంట్ బేస్డ్ ఆహారాలను మాత్రమే తీసుకుంటుంది సమంత. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications